మోదీ, రాహుల్‌ మధ్య తేడా బయటపెట్టిన ప్రశాంత్‌ కిషోర్‌?

Chakravarthi Kalyan
సార్వత్రిక సమరానికి సమయం దగ్గర పడుతుంది. మరోసారి గెలిచి ప్రధాని గా మోదీ బాధ్యతలు స్వీకరిస్తారా లేక ఇండియా కూటమికి అధికారాన్ని కట్టబెడతారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఎన్డీయే కూటమి గెలిస్తే మోదీ ప్రధాని అవుతారు. ఇండియా కూటమి అయితే రాహుల్ గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.  అంటే మోదీకి ప్రధాన పోటీ రాహుల్ గాంధీ అని చెప్పవచ్చు.

అయితే వీరిద్దరి మధ్య ప్రధాన తేడాను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక ఇంటర్య్వూలో చెప్పారు. రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికలోను ఓడిపోతున్నా కూడా.. తాను చేసే పనిలో 90శాతం ఫెయిల్యూర్ ఉన్నా అదే పనిని పట్టుకొని ఉండటం రాహుల్ గాంధీ గొప్పతనం అని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి అన్నీ తెలుసు అని అనిపిస్తోంది. మీరు సహాయం చేయలేరు. అతను సరైనది అని భావించిన దాన్ని అమలు చేసే వ్యక్తి అవసరం అని రాహుల్ నమ్ముతున్నారు అని పేర్కొన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన  విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ సమయంలో తాను తగ్గానని మరొకరు ఆ పని చేయనివ్వండి అని తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించలేదు. కానీ ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. తానే పని చేస్తానని.. మళ్లీ మళ్లీ ముందుకు వస్తున్నారు. ఇది ఆయన ఓపికకు ఉన్న నిదర్శనం అని వివరించారు.  ఒక్క మాటలో చెప్పాలంటే తాను చేయలేనప్పుడు వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఇన్ డైరెక్ట్ గా సూచించారు. ఇక ప్రధాని మోదీ విషయానికొస్తే.. రాహుల్ గాంధీ స్థానంలో మోదీ ఉంటే రాజకీయాలకు ఈ పాటికే గుడ్ బై చెప్పేవారని అన్నారు. ప్రధాని మోదీ మనస్తత్వం దృష్ట్యా ఆయన వల్ల కానప్పుడు వేరే వారికి అవకాశం ఇస్తారు.  డూ ఇట్ ఎయిథర్ లీవ్ ఇట్ అనే సూత్రాన్ని ఆయన పాటిస్తారని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: