జనసేనకు చివరి ఛాన్స్.. ఆశించిన ఫలితాలు రాకపోతే ఫ్యాన్స్ దూరమవుతారా?

Reddy P Rajasekhar
ఇతర రాజకీయ పార్టీలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికలు ఏ పార్టీకి అత్యంత కీలకం అనే ప్రశ్నకు జనసేన పేరు సమాధానంగా వినిపిస్తోంది. చాలా రోజుల నుంచి జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ జనసేన ఈ ఎన్నికల్లో కేవలం 21 స్థానాలల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన ఆశించిన ఫలితాలు సాధించకపోతే మాత్రమే ఈ పార్టీని నమ్ముకున్న ఫ్యాన్స్ సైతం దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.
 
ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీకి ఇదే చివరి అవకాశం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో అధికారంలోకి వస్తే ప్రజలకు కూటమి ఏం చేస్తుందో చెప్పడం కంటే జగన్ పై విమర్శలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తున్న మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీనే సత్తా  చాటే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. పిఠాపురంలో కూడా పవన్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
 
పొత్తు వల్ల కొన్ని స్థానాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గాజు గ్లాస్ గుర్తు పవన్ కే కేటాయిస్తారో లేదో కూడా కచ్చితంగా చెప్పలేము. మరికొన్ని గంటల్లో గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి తీర్పు వెలువడనుంది. జనసేన గాజు గ్లాస్ గుర్తును కోల్పోతే మాత్రం ఆ పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జనసేన పార్టీ కొన్ని స్థానాలలో ఏ మాత్రం పట్టు లేకపోయినా అభ్యర్థులను నిలబెట్టింది. అలాంటి స్థానాలలో వైసీపీకి సులువుగానే అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. పవన్ గ్యాప్ తీసుకుంటూ ప్రచారం చేస్తుండటంపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడకపోతే ఫలితాలు జనసేనకు అనుకూలంగా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలంటే పవన్ మరింత కష్టపడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: