తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తోందా.. బాబుకు అన్నీ అడ్డంకులేనా?

Reddy P Rajasekhar
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ముందు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు అన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెబుతుండగా జగన్ పై జరిగిన దాడి వల్ల ప్రజల్లో టీడీపీపై  కొంతమేర వ్యతిరేకత పెరుగుతోంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తోందా అనే విధంగా చంద్రబాబు నాయుడుకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. జగన్ పై దాడి వల్ల ఆయనపై ప్రజల్లో కొంతమేర సానుభూతి పెరిగింది.
 
అదే సమయంలో వేర్వేరు కారణాల వల్ల వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్ కు అనుకూలంగా పని చేయాలని జగన్ విషయంలో కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. జగన్ కు అనుకూలంగా పరిణామాలు మారుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులకు రెబల్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటం గమనార్హం.
 
జగన్ పై  దాడి కేసులో నిందితుడిని పట్టుకోవడం సులువు కాదని ఇప్పటికే తేలిపోయింది. పోలీసులు సైతం నిందితుడిని పట్టిస్తే 2 లక్షల రూపాయలు నజరానాగా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పాలనలో మంచి జరిగి ఉంటే మాత్రమే నాకు ఓటు వేయండంటూ జగన్ చేస్తున్న ప్రచారం సైతం ఆయనకు ప్లస్ అవుతోంది. ఇలా పాలన చూసి ఓట్లు అడిగే నేతలు ఎంతమంది ఉన్నారంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ఎక్కువ హామీలు అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్నా 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు అమలు చేయలేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు పూర్తిస్థాయిలో ఆశాజనకంగా లేవు. 2024 ఎన్నికల్లో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మరిన్ని వ్యూహాలతో ముందుకెళ్తే మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ రాబోయే మూడు వారాల్లో ప్రజల్లో మద్దతు పెరిగే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: