రాయి ఎటాక్: ఈ దాడుల్లో ఎవరికి కలిసొచ్చేను?

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ప్రస్తుతం రాళ్లదాడులుగా మారుతున్నాయి.. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి చేయడంతో అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు పైన కూడా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడు చేసినట్టుగా తెలుస్తోంది. రాళ్ల దాడులు అన్నటువంటి దాన్ని ఒకళ్ళ కోసం ఒకరు వేసుకున్నట్టుగా అనిపిస్తోంది. ముందుగా సీఎం జగన్ మీద రాళ్ల దాడి చేసినటువంటి వారిని పట్టుకుంటే అసలు నిజం బయటికి వస్తుందని పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా జగన్ పైన 2019 ఎన్నికలలో కత్తి దాడి చేసినటువంటి శ్రీనివాసును ఇప్పటికీ కాపాడుతున్నది ఎవరో ప్రజలకు బాగా తెలుసు.. శ్రీనివాస్ ఎవరి దగ్గర పని చేశారు? ఎవరు కాపాడుతున్నారు? ఎవరు అతని తరఫునుంచి లాయర్ గా వాదిస్తున్నారు.. ? ఏ మీడియా అతడికి సపోర్ట్ చేస్తోంది?  అది ఎవరన్నది? ప్రజలకు బాగా తెలుసు. కానీ అది మాత్రం కోడి కత్తి అంటూ ఒక డ్రామాగా మిగిలిపోయింది.. ఇప్పుడు మళ్లీ రాళ్లు వేయించి జగన్ పైన తనని తాను రాళ్లు వేయించుకున్నారని.. తనకి తానే దెబ్బ తిన్నారని సృష్టించారు.

అయితే ఈ వ్యవహారాలలో  ఇప్పటి వరకు అసలు చంద్రబాబు పైన రాళ్లు వేసింది ఎవరు.. పవన్ కళ్యాణ్ పైన రాళ్లు వేసింది ఎవరు.. ఎందుకు వేశారు.. అసలు వాళ్ళకి తగలకుండా ఎందుకు వేశారు అనే విషయమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవేళ చంద్రబాబు మీద రాయి వేసిన  వ్యక్తిని అంతమంది కార్యకర్తలు ఉన్నా ఎందుకు పట్టుకోలేదనేది ఇక్కడ ప్రశ్నగా మారుతోంది. మరి ఈ విషయాన్ని ఎలా చూడాలంటూ పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పైన రాయివేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అయినప్పటికీ కూడా అతను ఎవరనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు.. ఈ విషయాలన్నీ తేలాల్సి ఉన్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమోషనల్ పొలిటికల్ ఎవరిని ఏ వైపుగా తిప్పుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: