రాయి ఎటాక్ : జగన్ కు గాయమైతే ఏపీకి గాయమైనట్లా.. ఇలా విమర్శలు రైటా పవన్?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత ఆలస్యంగా స్పందించారు. సీఎం జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని బాపట్ల జిల్లాలో అమర్ నాథ్ గౌడ్ అనే వ్యక్తి తన అక్కను వేధించొద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్ధాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆ సమయంలో రాష్ట్రానికి గాయం కాలేదా? అంటూ పవన్ ప్రశ్నించారు.
 
చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? అంటూ ఆయన కామెంట్లు చేశారు. ఏపీలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గాయం కాలేదా? అని పవన్ ఒకింత ఘాటుగా విమర్శించారు. జగన్ కు రాయి తగిలితే మాత్రం రాష్ట్రానికి గాయమైనట్లా అంటూ పవన్ జగన్ పై నిప్పులు చెరిగారు. మీ చుట్టూ భద్రత ఉందని ఆపై జెండాలు ఉన్నాయని అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడం సాధ్యమవుతుందా అని పవన్ ప్రశ్నించారు.
 
మీరే దాడులు చేస్తారు? మీపైనే దాడులా? అంటూ పవన్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాన్నా పులి వచ్చె కథలా ఎన్నిసార్లు నమ్మాలి అని పవన్ అన్నారు. జగన్ లాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూటమిగా వచ్చామని పవన్ పేర్కొన్నారు. ముస్లింలను నేను ఓటు బ్యాంక్ గా వాడుకోనని ముస్లింలకు నేను అండగా నిలబడతానని ఆయన అన్నారు.
 
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ పేర్కొన్నారు. ఈజిప్ట్ లో, శ్రీలంకలో పాలకులను తరిమికొట్టినట్టు ప్రజలు తరిమికొడతారు జాగ్రత్త జగన్ అని పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే పవన్ స్పందించిన తీరు సరిగ్గా లేదని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం పవన్ కు సరికాదంటూ వాళ్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శలపై వైసీపీ నేతలు మాత్రం ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: