కత్తిమీద సాము చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి?

Purushottham Vinay
•కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద పరీక్ష పెట్టిన బీజేపీ
•పసలేని చోట రిస్క్ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి
•కత్తిమీద సాము చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి

మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇంకా కేంద్ర కాంగ్రెస్ పెద్దల దయ వల్ల మంత్రి కాకుండానే ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ని జాక్ పాట్ సీఎం అని ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తూ ఉంటారు.కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దగా మాస్ క్రేజ్  లేదు. పైగా ఉమ్మడి ఏపీ సీఎం తరువాత ఏకంగా పదేళ్ల పాటు ఆయన కనిపించకుండా అజ్ఞాతంలోకి పోయారని అంటారు.అయితే మళ్ళీ ఈ 2024 ఎన్నికలను ముహూర్తంగా చేసుకుని ఆయన రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎంపీ సీటుకి గురి పెట్టడం జరిగింది. ఆయనకు రాజం పేట సీటు ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. ఈ సీటులో బీజేపీకి బలం అసలు లేనే లేదు. 2014లో కూటమి తరఫున ఇక్కడ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూటమికి మంచి వేవ్ ఉన్న తరుణంలో ఆమె ఓటమి కావడం విశేషం.రాయలసీమ పరిధిలోని ఈ సీటులో టీడీపీ కూడా ఇప్పటికి గెలిచి 25 సంవత్సరాలు దాటింది. ఆ పార్టీ పెట్టాక కేవలం రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె ఇంకా పుంగనూరు ఉన్నాయి. ఈ ఏడింటిలో చూస్తే కనుక ఒక్క పీలేరులో మాత్రమే టీడీపీ చాలా బలంగా ఉంది.

ఇక ఆరు అసెంబ్లీ సీట్లలో టీడీపీకే బలం పెద్దగా లేదని అంటున్నారు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డికి ఈ సీటులో గెలుపు కత్తి మీద సాము అని తెలుస్తుంది. ఇక రాజంపేటలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిధున్ రెడ్డి బలమైన లీడర్ గా ఉన్నారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నల్లారి కుటుంబానికి మధ్య ఏకంగా నాలుగు దశాబ్దాల రాజకీయ వైరం ఉంది.దాంతో ప్రస్తుతం డైరెక్ట్ గా ఈ రెండు కుటుంబాలు ఢీ కొడుతున్నారు. నల్లారి వారిని ఖచ్చితంగా ఓడించి తీరుతామని వైసీపీ శపధం పడుతోంది. అంతే కాదు ఆయన కేవలం తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి విభజనకు కారకుడు అయ్యారని వైసీపీ నేతలు ఎన్నో విమర్శలు చేశారు. లాస్ట్ బాల్ అంటూ ఏపీ ప్రజలను తప్పు తోవ పట్టించారని కూడా ఆరోపిస్తున్నారు.ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయంగా ఇప్పటిదాకా జనంలోకి పెద్దగా రాని కిరణ్ కి రాజంపేట టికెట్ ఇచ్చి బీజేపీ పెద్ద పరీక్షపెట్టింది. అయితే ఆయన మాజీ సీఎం అని భావించే బీజేపీ టికెట్ ఇచ్చింది. కానీ ఆయన గెలుపు మీద సొంత పార్టీలోనే డౌట్లు ఉన్నాయి. మరి చూడాలి ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: