ఆదోని కింగ్ ఎవరు.. సాయిప్రసాద్ రెడ్డి, పార్థసారథిలలో గెలుపు ఆయనదేనా?

Reddy P Rajasekhar
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నుంచి వై సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు. సాయిప్రసాద్ రెడ్డి పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నేత తర్వాత రోజుల్లో కాంగ్రెస్ లో చేరి 2004 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో వైసీపీలో చేరిన సాయిప్రసాద్ రెడ్డికి 2014, 2019 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయి.
 
స్థానికంగా మంచి పేరు ఉండటంతో వైసీపీ సాయిప్రసాద్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చింది. పార్థసారథి విషయానికి వస్తే వృత్తిరిత్యా డాక్టర్ అయిన పార్థసారథి 2018 నుంచి బీజేపీలో ఉన్నారు. పార్థసారథి బోయ సామాజికవర్గ నేత కాగా ఈ నియోజకవర్గంలో బోయ, ముస్లిం ఓటర్లు అభ్యర్థి గెలుపోటములను డిసైడ్ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో బోయ సామాజికవర్గం ఓట్లు 41,000 ఉండగా ముస్లిం ఓట్లు 34 వేలు ఉన్నాయి.
 
ఆదోని నియోజకవర్గం పత్తి క్రయవిక్రయాలకు పాపులర్ కాగా సెకండ్ బాంబే అని ఆదోనిని పిలుస్తారు. సాయిప్రసాద్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. మరోవైపు పార్థసారథికి టీడీపీ, జనసేన కార్యకర్తల నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం.
 
ముస్లిం ఓటర్లు ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు  వస్తాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సర్వేలు సాయిప్రసాద్ రెడ్డికి అనుకూలంగా ఉండగా మరికొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. రెండు పార్టీల అభర్థులకు ప్లస్ పాయింట్లు ఏ స్థాయిలో ఉన్నాయో మైనస్ పాయింట్లు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆదోని నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సాయిప్రసాద్ రెడ్డి, పార్థసారథి మధ్య హోరాహోరీ పోరు ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: