ఏపీ: బాలయ్య బాబు ఎంట్రీతో చంద్రబాబు గెలుపు ఖాయం అవుతుందా...??

Suma Kallamadi
పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో వైసీపీ పార్టీని గెలిపించడానికి జగన్‌తో పాటు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ కూడా ప్రచారాలు చేశారు. వారు తమ వంతు కష్టపడుతూ వైసీపీ పార్టీ గెలుపులో కీలకమైన పాత్ర పోషించారు కానీ ఈసారి జగన్ ఒంటరి పక్షిగా రాష్ట్రమంతటా తిరుగుతూ మొత్తం ప్రచార బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నారు. సింగల్ హ్యాండెడ్ గా ఆయన పార్టీని ప్రజల్లో ప్రమోట్ చేస్తున్నారు.
2019 ఎలక్షన్ల విషయానికొస్తే చంద్రబాబు నాయుడు లోకేష్, బాలకృష్ణ సహాయంతో ప్రచారాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఆయనకు పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. వీరిద్దరూ జగన్ ఒంటరివాడు కానీ తాము ఇద్దరం ప్రజల్లో ఎంతో మద్దతు ఉన్నా వాళ్లం అని చెప్పేందుకు ట్రై చేస్తున్నారు. మరోవైపు మంగళగిరికి లోకేష్ పరిమితమయ్యారు. ఇక హిందూపూర్ ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా రంగంలోకి దిగుతున్నారు. సైకిల్ రావాలి పేరిట ఒక ప్రచార యాత్రను ఆయన చేయనున్నారు. జగన్ వస్తుంటే ప్రజలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే చివరిదాకా వింటూ చప్పట్లు కొడుతూ మద్దతు తెలుపుతున్నారు.
చంద్రబాబుకు మాత్రం ఇలాంటి విశేష స్పందన రావడం లేదు. చంద్రబాబు వస్తున్నారంటే మామూలుగా చూసి తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో వినకుండా వెళ్ళిపోతున్నారు. జనాలు ఏమాత్రం ఎగబడటం లేదు. అందుకే బాలకృష్ణను చంద్రబాబు దింపుతున్నారని తెలుస్తోంది. సినీ సెలబ్రిటీలకు ఇమేజ్, పాపులారిటీ ఎక్కువ కాబట్టి జనాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. బాలకృష్ణను ముందు ఉంచితే అలాంటి ప్రయోజనాలు ఉంటాయని ఈ టీడీపీ అధినేత భావిస్తున్నారు. తద్వారా ప్రజల్ని రాత్రి పగలు తమ ప్రచార కార్యక్రమాల వద్ద ఉంచేలా చేద్దామని అనుకుంటున్నారు.
బాలయ్య బాబు ఏప్రిల్ 12న కదిరి, పుట్టపర్తి, అనంతపురం.. ఏప్రిల్ 13న శింగనమల, తాడిపత్రి.. ఏప్రిల్ 14న బనగానపల్లి, ఆళ్లగడ్డ, నంద్యాల.. ఏప్రిల్15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు.. ఏప్రిల్16న కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, నియోజకవర్గాల్లో బాలకృష్ణ తిరుగుతారు. ఈనెల 17న పత్తికొండ, ఆలూరు, రాయదుర్గ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాలయ్య పెద్దగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనరు కానీ ఈసారి వైసీపీ అరాచక పాలనకు చెక్ పెడదామని, కార్యకర్తలు, పార్టీ నేతలకు మద్దతుగా ఉంటూ టీడీపీ పార్టీని గెలిపించాలని రంగంలోకి దిగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: