ఏపీ: ఇదేందయ్యా ఇది... వాలంటీర్ల వ్యవస్థను జగన్ రద్దు చేశాడా?

Suma Kallamadi
ఆంధ్రా వాలంటీర్ల వ్యవస్థ ఒక్క ఏపీలోనే కాదు... యావత్ దేశంలోనే పేరుగాంచిన వ్యవస్థగా పేరు తెచ్చుకుంది. ఓ వర్గం వారు అది కేవలం జగన్ తన రాజకీయ లబ్ది కోసమే సృష్టించుకున్నాడు అని అనుకున్నప్పటికీ దానినుండి లబ్ది పొందిన వాళ్ళు మాత్రం జగన్ ని పొగడకుండా ఉండలేరు అనడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి వాలంటీర్ల వ్యవస్థను స్వయంగా జగన్ రద్దు చేశాడా అంటే అనుమానం కలగక మానదు. అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రచార సభల్లో అదే చెబుతున్నట్టు కనబడుతోంది. విషయం ఏమిటంటే వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందని, తాను రాగానే మరలా మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనే పెడతానని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నిజానికి ఆ వ్యవస్థకు లాస్ట్ వర్కింగ్ డే మే 31. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు మొత్తం పూర్తయిపోతాయి. మామూలుగా కోడ్ రాక ముందే ఈ వ్యవస్థ కొనసాగింపునకు ఉత్తర్వులు ఇచ్చేవారు. జగన్ కు ఆ ఉద్దేశం లేదు కాబట్టి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇకపొతే ప్రతిపక్ష పార్టీ... "వాలంటీర్లకు ప్రధానంగా ఉండే విధి పించన్లు పంచడం. మూడు వేలు పించన్ ఇవ్వడానికి ఐదు వేల జీతం ఎందుకు? పింఛన్లు పంచిన తరువాత మిగదంతా వారు చేసేది వైసీపీ పనే. ఇపుడు ఆపని చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాలంటీర్లకు పనేమీ లేదు. ఇక ఇచ్చే ఆ ఐదు వేల జీతం కూడా ఎందుకు దండగ అనుకున్నారేమో? ఆ వ్యవస్థను ఇపుడు జగన్ రద్దు చేసేసినట్లుగా ప్రకటిస్తున్నారు!" అని టీడీపీ ఫిర్యాదు చేస్తోంది.
ఈ క్రమంలోనే వాలంటీర్లు అనేవారు నీతి, నిజాయితీగా ఉంటే తప్పకుండా కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అయితే అసలు కొనసాగించడానికి అవకాశం లేకుండా ముందే ఆ వ్యవస్థను రద్దు చేసేసే దిశగా స్వయంగా జగన్ మామయ్య కుట్ర అమలు చేసినట్లుగా కనిపిస్తోంది అని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో వాలంటీర్లు ఎరుకతో ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసి ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి, ప్రైవేటు సంస్థలకు పంపడంలో వాలంటీర్లు చాలా కీలక పాత్ర పోషించారని ఆమధ్య జనసేనాని ఆరోపించిన సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: