ఏపీ : మళ్లీ సీఎం అయితే జగన్ ప్రణాళికలివే.. బాబుకు అలా చెక్ పెడతారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 120 కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధించి వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొనిరావాలని జగన్ భావిస్తుండగా జనసేన, బీజేపీ పొత్తు వల్ల సులువుగానే కూటమి అధికారంలోకి వస్తుందని బాబు ఫీలవుతున్నారు. ఏపీలో జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రం టీడీపీ, జనసేన విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరించేలా జగన్ ప్రణాళికలు ఉండబోతున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీలోని కీలక నేతలకు వైసీపీలో చేరే ఛాన్స్ కల్పించనున్నారని ఈ విధంగా చేయడం ద్వారా టీడీపీని వీలైనంత బలహీనపరిచేలా జగన్ అడుగులు వేయనున్నారని సమాచారం అందుతోంది. చంద్రబాబు ఎన్ని హామీలను ప్రకటించినా వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో బాబుకు భారీ షాకులు తగలడం ఖాయమని తెలుస్తోంది. పోటాపోటీ నియోజకవర్గాలపై జగన్ ప్రధానంగా దృష్టి పెట్టారని సమాచారం.
 
80 స్థానాలలో వైసీపీ విజయానికి ఢోకా లేదని 40 నుంచి 50 స్థానాలలో హోరాహోరీ పోరు ఉండబోతుందని ఈ స్థానాలపై దృష్టి పెట్టి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం సులువేనని జగన్ ఫిక్స్ అయినట్టు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. 50 స్థానాలలో మాత్రం కూటమికి అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని అక్కడ వైసీపీ నేతలు గెలవడం కష్టమని జగన్ ఫీలయ్యారట.
 
ప్రస్తుతం చంద్రబాబు వయస్సు 74 సంవత్సరాలు కాగా 2029 ఎన్నికల సమయానికి బాబు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం సులువు కాదని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరిచే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఫిక్స్ అయ్యారని భోగట్టా. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత షర్మిలకు సైతం షాకిచ్చేలా జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని వైసీపీ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తాయో లేదో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: