కర్నూలులో వైఎస్సార్‌సీపీని వెంటాడుతోన్న కొత్త సమస్యలు..?

Suma Kallamadi
* కర్నూల్‌లో YSRCPకి కొత్త సమస్యలు
* స్థానికేతర అభ్యర్థుల ఎంపికతో స్థానిక పార్టీ సభ్యులలో అసంతృప్తి
* అభ్యర్థికి మద్దతు అందించడమే పార్టీకి అసలైన సవాల్‌
(రాయలసీమ - ఇండియా హెరాల్డ్)
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది మే 13న మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏ పార్టీకాపార్టీ సొంత సమస్యలతో సతమతమవుతున్నాయి. వైసీపీకి కూడా ఈ సవాళ్లు తప్పడం లేదు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలానే సమస్యలు ఎదుర్కొంటోంది.
ఒక్క కాన్స్టియెన్సీ కాదు అనేక నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీ సవాళ్లను ఎదుర్కొంటోంది. స్థానికేతర అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించడంతో స్థానిక పార్టీ సభ్యుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టిక్కెట్లు ఆశించిన కొందరు నేతలు వ్యతిరేకులుగా మారారు.
* కోడుమూరు నియోజకవర్గం
స్థానికేతర అభ్యర్థి ఆదిమూలపు సతీష్‌కు పార్టీ టికెట్‌ లభించింది. దానివల్ల టికెట్ ఆశించిన స్థానిక నేతలలో నిరాశ పెరిగిపోయింది. దాని కారణంగా కొందరు స్థానికులు వైఎస్సార్‌సీపీకి బదులు ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.
* కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం
కర్నూలు అసెంబ్లీ టికెట్ సాధించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ ఎవరి మద్దతు లభించక ఒంటరి పక్షయ్యారు. నిజానికి ఈ అధికారి నియోజకవర్గ ప్రజలకు చాలా కొత్త. ఇక రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తి. కాబట్టి ఆయనకు మద్దతు అనేది చాలా అవసరం కానీ అది దొరకడం లేదు. ఆయన అభ్యర్థిత్వం పార్టీలో ఉత్కంఠకు కారణమైంది.ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ మద్దతుదారులు ఇంతియాజ్‌కు చురుగ్గా మద్దతు ఇవ్వడం లేదు.
* ఎమ్మిగనూరు నియోజకవర్గం
మాజీ లోక్‌సభ సభ్యురాలు, ఎమ్మిగనూరు నియోజకవర్గం అభ్యర్థి బుట్టా రేణుక స్థానికురాలినే అని చెప్పుకుంటున్నారు కానీ ఆమె నిజానికి స్థానిక వ్యక్తి కాదు. స్థానికేతర అభ్యర్థులు ఇక్కడ పార్టీ ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నారు.
* నందికొట్కూరు నియోజకవర్గం
పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్థానికేతరుడైన డాక్టర్ సుధీర్ ధారను రంగంలోకి దించారు. సుధీర్‌ది కర్నూలు కాదు కడప జిల్లా పులివెందుల. ఈ ఎంపికపై నందికొట్కూరులోని క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు.
* ఆదోని నియోజకవర్గం
బీజేపీ (ఎన్‌డీఏ కూటమిలో భాగం) స్థానికేతరుడైన పార్థసారధికి సీటు కేటాయించింది. టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికేతర అభ్యర్థులను ఇరు పార్టీల కేడర్‌ వ్యతిరేకిస్తున్నారు.
ఈ పరిస్థితి పోటీదారులతో పాటు పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక నేతల మద్దతుదారులు స్థానికేతర అభ్యర్థులకు చురుగ్గా మద్దతు ఇవ్వడం లేదు. ఇంతియాజ్, హఫీజ్ ఖాన్ మధ్య విభేదాలు ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: