లేటెస్ట్ సర్వే : జగన్ పై చంద్రబాబుదే విజయం కానీ...?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో, ఓ సర్వే ఆధారంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడిపోవచ్చని తేలింది. అలాగే, టీడీపీకి కూడా మెజారిటీ రాదని వెల్లడైంది. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ సీపీ, టీడీపీ దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ, సర్వే ఏజెన్సీ CNXతో కలిసి దేశవ్యాప్తంగా ఒపీనియన్ పోల్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సర్వే మార్చి 1 నుంచి 30వ తేదీవరకు జరిగింది. 

ఈ పోల్ లో భాగంగా సుమారు 1.80 లక్షల మందితో అభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ సర్వే ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ స్వల్ప తేడాతో ఓడిపోవచ్చని వెల్లడైంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ-జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్ల మెజారిటీ కూడా రాకపోవచ్చని స్పష్టం చేసింది. అంటే కాకుండా టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 84 సీట్లు గెలుస్తుందని, వైసీపీ 70 సీట్లు సొంతం చేసుకుంటుందని ఒపీనియన్ పోల్ చెబుతోంది. 

ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి 90 అసెంబ్లీ స్థానాల పూర్తి మెజారిటీకి చేరుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని స‌ర్వే చెబుతోంది. అయితే ముందు నుండీ ఏపీలో ఈసారి వైసీపీ అధికారం కోల్పోతుంద‌ని టీడీపీ భారీ మెజారిటీతో విజ‌యం సాధిస్తుంద‌ని టాక్ వినిపించిన సంగ‌తి తెలిసిందే. సీఎన్ఎక్స్ స‌ర్వే కూడా అదే చెబుతోంది. కానీ వైసీపీ మూడు పార్టీల‌కు గట్టి పోటీ ఇస్తుంద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అంతే కాదు ఎన్నిక‌లు ఇంకా స‌మ‌యం ఉన్నందున అప్ప‌టి వ‌ర‌కు ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. చివరి నిమిషంలో ఓటర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోనూ వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: