ఆంధ్రప్రదేశ్: టీడీపీలో చేరగానే రఘురామకృష్ణం రాజుకు భారీ షాక్.. అలా చేయకపోతే దెబ్బే..??

Suma Kallamadi

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలో చేరితే ఈ రాజకీయ నాయకుడికి లోక్‌సభ నరసాపురం సీటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆ విషయంలో టీడీపీ అధిష్టానం అతనికి హామీ ఇవ్వలేదు. బదులుగా చంద్రబాబు ఇటీవల రఘురామ కృష్ణంరాజుకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. అయితే సీటు ఇవ్వగానే సంబరం కాదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గెలవాలి.
అయితే రఘురామ కృష్ణంరాజు ఓటుకు ఐదువేలైనా ఇచ్చి ఉండి నియోజకవర్గంలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గెలుపొంది అసెంబ్లీలో స్పీకర్ అయ్యి జగన్ ను ఎండగడతానని ప్రచారం చేస్తున్నారు. అయితే ఉండి నియోజకవర్గం టికెట్‌ను ఇతరులు కూడా ఆశించారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కలవపూడి శివ అలియాస్ శివరామరాజు, రాంబాబు అలియాస్ రామరాజు ఈ టికెట్ కోసం చాలానే ప్రయత్నించారు అయితే వీరిద్దరికీ కాకుండా రఘురామ కృష్ణంరాజుకి ఆ టికెట్ దక్కింది. దాంతో వారి ఆగ్రహం మరింత ఎక్కువయింది. ఈ ఇద్దరు నేతలు రఘురామకృష్ణం రాజకీయ రివర్స్ కూడా అవుతున్నట్లు తెలుస్తోంది.
ఆ నియోజకవర్గంలో గెలవాలంటే వీరిద్దరినీ రఘురామ కృష్ణంరాజు మంచిగా చేసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం వారికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి తన వైపు తిప్పుకోవచ్చు. లేదంటే చంద్రబాబు అయిన వారిద్దరినీ బుజ్జగించి రఘురామకృష్ణ రాజుకు సపోర్ట్ చేయమని అడగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా టీడీపీ గెలిస్తే ఈ వైసీపీ రెబల్ ఎంపీకి ప్లస్ అవుతుంది. లేకపోతే అతడి రాజకీయ భవిష్యత్తుకు ఎండ్‌ కార్డు పడటం ఖాయం. రెండు వైపులా చెడినట్లు కూడా అవుతుంది. మరి ఇతడి అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే దాదాపు 60 రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ప్రస్తుత సీఎం ఏపీ జగన్ అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నారు. ఆయనకు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా విపరీతమైన ఆదరణ, స్పందన లభిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా కొనసాగలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: