పవన్ తప్పులకు మండిపడుతున్న ఫ్యాన్స్?

Purushottham Vinay
పవర్ స్టార్ కళ్యాణ్ వరుస సినిమాలని సైతం పక్కన బెట్టి కొన్ని నెలలుగా పూర్తిగా పొలిటికల్ గా బిజీ అయిన సంగతి తెలిసిందే. చేస్తోన్న సినిమాలన్నింటిని పక్కనబెట్టేసి పూర్తిగా పాలిటిక్స్ పనిలో ఉన్నారు. సినిమా అనే టాపిక్ లేకుండా ఓట్లు కోసం తిరుగుతున్నారు.ఎక్కడా సినిమా అనే ముచ్చట లేకుండా వారాహి యాత్ర సాగుతోంది. కూటమితో అభిమానులు  డీవియేట్ అయ్యారు. జన సైనికులు పవన్ కళ్యాణ్ పై గుర్రుగా ఉన్నారు.ఎక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించినా పీకే అభిమానుల నోట సినిమా అనే మాట రాలేదు. ఏ సమావేశంలో కూడా అన్నా సినిమా అని ఏ అభిమాని కూడా గొంతెత్తి అరవడం లేదు.అలాగే 21 సీట్లు ఇవ్వడంతో సీఎం సీఎం అనే పదం కూడా వినిపించడం లేదు.అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా బొమ్మలు పట్టుకుని గెంతులు వేయడంగానీ...సమావేశ ప్రాంగణంలో సినిమా ప్లెక్సీలు వేయడం గానీ ఏదీ ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ అసలు సొంత పార్టీ పెట్టి టీడీపీతో కలవడం అస్సలు అభిమానులకి నచ్చడం లేదు.

పవన్ కళ్యాణ్ సోలోగా నిల్చుంటే సీఎం అవుతాడంటూ ఫ్యాన్స్ భావించారు. పోనీ పొత్తులో భాగంగా గెలిస్తే పవర్ షేరింగ్ అయినా ఉంటుందా అంటే ఆ ముచ్చట కూడా లేదు. పాపం జనసేన పార్టీని నమ్ముకున్న అభ్యర్థులని కాదని టీడీపీ నేతలపై మొగ్గు చూపి వారికి టిక్కెట్లు కేటాయించడం ఫ్యాన్స్ కి అస్సలు నచ్చట్లేదు.సోషల్ మీడియాలో వేరే హీరో అభిమానులు పవన్ కళ్యాణ్ ని లాజిక్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ట్రోల్ చేసిన వారిపై పర్సనల్ అటాక్ కి దిగుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఆయన్ని ఎక్కడో ఆకాశంలో ఊహించుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్ ఇది చెయ్యొద్దని కోరుకుంటుంటే పవన్ అదే చేస్తున్నాడు. ఇలా ప్రతి విషయంలో ఫ్యాన్స్ పవన్ విషయంలో అసంతృప్తిగా, కోపంగా ఉన్నారు.అసలు పవన్ జనసేన పార్టీని మరిచి టీడీపీకే అంకితం అయిపోయారా అని చాలా మంది ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా దూరం అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: