ఏపీ: ఉమ్మడి కృష్ణాపై.. ఆ సర్వే సంచలన ఫలితాలు?

Chakravarthi Kalyan
సెఫాలజిస్ట్ పార్ధా దాస్.. ఎన్నికల సమయంలో తరచూ వినిపిస్తున్న పేరు. చాణక్య సంస్థ పేరిట సర్వే చేపడుతుంటారు. ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపడుతుంటారు. ఓటర్ల అభిప్రాయాన్ని క్రోడికరించి నివేదికలు రూపొందింస్తుంటారు. ఈ సర్వేలు కొన్ని నమ్మశక్యంగా ఉంటాయి. ప్రజాభిప్రాయానికి దగ్గరగా ఉంటాయి.  తాజాగా ఆయన ఏపీలో ఓటర్ల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఏపీలోని కృష్ణా జిల్లా సర్వే ఫలితాలను ఆయన వెల్లడించారు. ఈ జిల్లాపై టీడీపీ కూటమి ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.  మరోవైపు కృష్ణా జిల్లా టీడీపీ కంచుకోటగా ఉంది. కానీ గత ఎన్నికల వైసీపీ సునామీలో ఈ జిల్లా కూడా కొట్టుకుపోయింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తున్న తరుణంలో ఆ పార్టీకి షాకింగ్ ఫలితాలు ఎదురువుతాయని పార్ధా దాస్ వెల్లడించారు.

మొత్తంగా చూసుకుంటే టీడీపీ కూటమికి 6-9 సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇక అధికార వైసీపీ విషయానికొస్తే 9-10 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఓట్ షేర్ విషయానికొస్తే కిందటి సారి వైసీపీకి 49.8శాతం ఓట్లు రాగా ఈసారి.. 50.5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కిందటి సారి టీడీపీకి సుమారు 40శాతం, జనసేనకి ఐదు శాతం, బీజేపీకి 0.8శాతం ఓట్లు వచ్చాయి.  ఈ సారి ముగ్గురు కలిస్తే ఓటు శాతం కొంత మేర పెరిగి 47.6శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

ఇక విభాగాల వారీగా చూసుకుంటే పురుషుల ఓటర్లు వైసీపీకే అనుకూలంగా ఉన్నారని సర్వే ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది. ఫ్యాను గుర్తుకు 49.1శాతం ఓటర్లు మొగ్గు చూపగా… టీడీపీకి 48.7శాతం మంది ఉన్నారు. మహిళల విషయానికొస్తే వైసీపీకి 54.1 శాతం మంది మద్దతు తెలపగా.. టీడీపీకి 44.6శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ప్రధాని మంత్రిగా మోదీనే కావాలని కోరుకునే వారు 38.7 శాతం మంది అయితే రాహుల్ గాంధీ కావాలనుకునేవారు 35శాతం మంది ఉన్నారు. తటస్థులు 26.1 శాతం ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: