రాయలసీమ (హిందూపురం): 4 దశాబ్దాలలో ఓటమెరుగని టీడీపీ.. ఇప్పుడు గెలవగలదా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి నేతలలో సెగలు పుట్టిస్తోంది.. అందులో భాగంగానే హిందూపురం అంటేనే కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు బాలయ్య. అలాంటి బాలయ్య అడ్డాపై ఇప్పుడు వైసీపీ కన్ను పడింది.. మరి బాలయ్య అడ్డా ను వైసీపీ కైవసం చేసుకుంటుందా? అసలు వైసీపీ, టీడీపీ మధ్య పోరు ఎలా ఉంది..? హిందూపురంలో ఎవరిది పై చేయి అవుతుంది? నాలుగు దశాబ్దాలుగా హిందూపురంలో పాతుకుపోయిన టిడిపిని ఇప్పుడు వైసీపీ ఓడించగలదా..? అనే అంశాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పుడు ఇండియా హెరాల్డ్ కి అందిన సమాచారం మేరకు తెలుసుకుందాం..
బాలయ్య బాబు 2014 , 2019 లలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో గెలిచారు. ఇక ఈసారి కూడా విజయాన్ని అందుకొని హ్యాట్రిక్స్ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క హిందూపురం నియోజకవర్గం అనగానే టీడీపీ ఆవిర్భావం మొదటి ఎన్నిక 1983 నుంచి మొన్న జరిగిన 2019 వరకు కూడా ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలుస్తూనే వస్తోంది. అంతటి కంచుకోట ఈ హిందూపురం. 2019లో కూడా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ గెలవడంతో.. ఈసారి జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. హిందూపురంలో ఏ సామాజిక వర్గం అయితే బాలయ్యకు సపోర్టుగా నిలుస్తున్నారో వారిని తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు. హిందూపురంలో టీడీపీకి  బోయ, కురబ, ముస్లిం, చేనేత ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. మరోవైపు కూటమి కారణంగా ముస్లిం ఓట్లు చీలే అవకాశం కనిపిస్తున్నాయి.. అలాగే చేనేతకు అందిస్తున్న చేయూత కారణంగా కూడా ఓట్లు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో టిడిపి హిందూపురంలో 51.12% ఓట్లతో గెలిచింది..2019లో  51.47 శాతంతో గెలిచింది. దీంతో ఇప్పుడు అందరి కన్ను టిడిపి పైనే..
ఇక హిందూపురంలో వైసీపీ పరిస్థితి విషయానికి వస్తే.. ఈసారి వైసీపీ పార్టీ నుంచి దీపిక బరిలోకి దిగారు. లోకల్ గా చూసుకుంటే దీపికకు హిందూపురంలో బలం లేదనే చెప్పాలి. పైగా వైసీపీలో పలు రకాల విభేదాలు కూడా వున్నాయి. దీపికకు సీటు ఇచ్చిన తర్వాత కూడా చాలామంది నేతలు అసహనం వ్యక్తం చేయగా.. అందులో ఇక్బాల్ ఏకంగా రాజీనామా చేశారు. హిందూపూర్ లో సొంత నాయకులే యాంటీగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కురబ సామాజిక వర్గం కూడా హిందూపూర్ లో ఎక్కువగా ఉండడం చేత వైసిపి అభ్యర్థి కూడా ఆమె కావడం చేత ఓట్లు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈసారి టిడిపిని ఓడించాలని పెద్దిరెడ్డి కూడా పలు రకాల ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
కానీ ఎవరు ఎన్ని ప్రణాళికలు చేసినా.. ఎంతలా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా.. కంచుకోట లాంటి హిందూపురాన్ని ఎవరు అంత త్వరగా లాక్కోలేరని స్పష్టం అవుతోంది..ముఖ్యంగా 1983లో పార్టీ స్థాపించినప్పటి నుంచి మొన్న జరిగిన 2019 ఎన్నికల వరకు ఒక్కసారి కూడా టిడిపి ఓడిపోలేదు.. పైగా అక్కడ అభివృద్ధి పనులే కాదు అక్కడి ప్రజల కోసం బాలయ్య కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు ఇక ఈ నేపథ్యంలోనే హిందూపురంలో టిడిపిని ఢీకొట్టే పార్టీ మరొకటి లేదని తేలిపోయింది.. ఒకవేళ టిడిపిని ఓడిస్తే మాత్రం ఆ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: