ఏపీ: సెగలు పుట్టిస్తున్న జగన్‌పై నారా లోకేష్ ట్వీట్?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో విపక్షాలన్నీ తమదైన రీతిలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకు పడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారాన్ని పుట్టిస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. నారా లోకేష్ జగన్ ని ఉద్దేశించి పోస్టు పెడుతూ... "ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహారం ఎలా ఉందంటే నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించిన మాదిరిగా ఉంది. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ జగన్ బహిరంగ వేదికలపై ప్రేమ కురిపిస్తారు, మరోవైపు వైసిపి రౌడీ మూకలు ప్రతిరోజూ ఆయా సామాన్య వర్గాలపై దాడులకు తెగబడుతూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి." అంటూ రాసుకొచ్చారు.
కాగా ఈ వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ హీట్ ని పెంచేవిగా వున్నాయి. ఇంకా లోకేష్ ఆ పోస్టులో... ఏం రాసుకొచ్చారంటే... "పెండ్లిమర్రు గ్రామంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు అనే బిసి యువకుడ్ని హత్య చేసి 24గంటలు కూడా గడవక ముందే తాజాగా నంది కొట్కూరు పట్టణంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడు శ్రీనివాస రెడ్డి నమాజ్‌కు వెళ్లి వస్తున్న ముస్లిం మహిళను బురకా తొలగించి లైంగికంగా వేదించడమేకాక అదేమని ప్రశ్నిస్తే ప్రశ్నించిన నేరానికి ఆమె భర్త, కుమారుడిపై చెప్పుతో దాడికి తెగబడ్డాడు. అధికారమదంతో కొట్టుకుంటున్న జగన్ అండ్ కో కు మరో 37రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలసి తగిన బుద్ధి చెబుతారు!" అని ట్వీట్ చేశారు.
అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కూటమి నేతలు, కార్యకర్తలు ఆ పోస్టుని విపరీతంగా షేర్లు కొట్టడంతో అది సోషల్ మీడియా షేక్ చేస్తోంది. దాంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ వర్గం వారు లోకేష్ మాటలని కొట్టేపారేస్తుంటే, మరి కొంతమంది మాత్రం జగన్ రాక్షస పాలనికి ఇదొక అద్దం వంటిదని, గతంలో ఎన్నో జరిగాయి అని, ప్రజలు ఇప్పటికైనా మారి జగన్ ని గద్దె దించాలని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: