విశాఖ: ఆ సీట్లపై వైసీపీ ఫుల్ ఫోకస్?

Purushottham Vinay
వైసీపీ ఈసారి విశాఖ సిటీలోని రెండు కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల మీద గట్టిగా దృష్టి పెట్టింది. అది కూడా టీడీపీ సిట్టింగులు చాలా కాలం నుంచి ఉంటున్న నియోజకవర్గాల మీద కావడం విశేషం.విశాఖలో గట్టి పట్టుని సాధించి ఎంపీ సీటుని గెలుచుకొవడం అలాగే సిటీలో ఉన్న నాలుగు ఎమ్మెల్యేలలో కనీసం మూడు  గెలుచుకోవాలన్నది వైసీపీ ప్లాన్ అని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది.ఇక విశాఖ నుంచి లోక్ సభకు సీనియర్ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు.విశాఖలో ఈసారి ఎంపీ సీటుకు గట్టి ఫైట్ ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం దేశం పార్టీ నుంచి మాజీ ఎంపీ దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు పోటీలో ఉన్నారు.ఇక టీడీపీ వర్సెస్ వైసీపీ గా ఈసారి ఎంపీ స్థానానికి రసవత్తరమైన పోటీ ఉండబోతోంది. అలాగే టీడీపీకి గతంలో ఉన్నత సానుకూలత ఈసారి విశాఖ సిటీలో ఉండదని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.అందుకు కారణం సిటీలో ఈసారి మార్పులు ఉండడమే అంటున్నారు.


వైసీపీ తన అభ్యర్ధులను మార్చింది. టీడీపీ అయితే చాలా చోట్ల పాతవారికే సీట్లు ఇచ్చింది. దాంతో ఆయా చోట్ల సిట్టింగులకు యాంటీ ఇంకెంబెన్సీ సమస్య ఉందని సమాచారం తెలుస్తుంది.విశాఖ ఈస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు మూడు టెర్ములు చేశారు. ఇక్కడ జనాలు మార్పు కోరుకుంటే వైసీపీకి పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే విశాఖ వెస్ట్ లో కూడా రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గెలిచారు. అయితే ఈసారి మాత్రం బిగ్ షాట్ గా విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ కి వైసీపీ సీటు ఇచ్చింది.గెలుపు కోసం బాగా కష్టపడుతున్నారు.ఈసారి తమకు చాన్స్ ఇస్తే తమ పవర్ ఏంటో చూపిస్తామని అంటున్నారు. ఒక్క చాన్స్ అన్న నినాదంతో విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ ఇంకా పశ్చిమలో ఆడారి ఆనంద్ కుమార్ జనాలను కలుస్తున్నారు.ప్రజల్లో ఇదే విషయం చర్చకు పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు చాలా చాన్సులు ఇచ్చారు. మాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అంటున్నారు.ప్రస్తుతం విశాఖలో తూర్పు పశ్చిమల ఫలితం ఈసారి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: