ఆంధ్రప్రదేశ్: వైసీపీలో గొడవలు.. హైలెట్ చేస్తున్న పచ్చ మీడియా..?

Suma Kallamadi
టీడీపీలో కేశినేని నాని ఎంత రచ్చ లేపిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. రాయపాటి రంగబాబు, స్వామిదాసు బయటికి రావడం వంటివి కూడా టీడీపీని బాగా దెబ్బతీసాయి. ఇలాంటి ఘటనలను సాక్షి టీవీ బాగా హైలైట్ చేస్తోంది. టీడీపీలో సఖ్యత లేదని ఆ పార్టీ పని అయిపోయిందన్నట్లుగా సాక్షి టీవీ కథనాలను ప్రచురిస్తోంది. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు వైసీపీకి జరుగుతున్న చెడు విషయాలను హైలెట్ చేసి చూపిస్తున్నాయి. వైసీపీ పార్టీ నాయకులకు ద్రోహం చేస్తుందన్నట్లుగా అవి కథనాలు రాస్తున్నాయి.
 జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సొంత పార్టీ నేత లే వ్యతిరేకత చూపిస్తున్నారు అన్నట్లు తాజాగా ఒక ఆర్టికల్ రాశాయి. 2019లో పనిచేసిన కార్యకర్తలకు నిరాశే ఎదురయింది అని తెలిపింది. కృష్ణా జిల్లా పెనమలూరు ఇన్ చార్జీగా జోగి రమేష్ ను నియమించడంపై స్థానిక వైసీపీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయని కూడా ఈనాడు రాసుకు వచ్చింది.
 ఆ సీటు తమకే కేటాయించాలని కంకిపాడు కేంద్రం పడమట సురేష్ బాబు, కమ్మ కార్పోరేషన్ తుమ్మల చంద్రశేఖర్ ఇప్పటికే వైసీపీ అధినేతను అడిగినట్లు తెలుస్తోంది. ఇక వీడితో పాటు వైసీపీలో అవుతున్న అంతర్గత గొడవల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బాగా హైలెట్ చేస్తున్నాయి. చిన్నాచితక గొడవలు అన్నీ కూడా డైలీ న్యూస్ పేపర్లలో బాగా హైలెట్ చేసి ప్రచురిస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా వైసీపీ పార్టీ ప్రజాదరణను దెబ్బతీసేలా వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తోంది. మొన్న ఈ మధ్య జగన్ బస్సు సభకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదని వీడియోలు కూడా షేర్ చేసింది.
వైసీపీ ప్రతికూలతలను ఇవి బాగానే కవర్ చేయగలుగుతున్నాయి కానీ చంద్రబాబు చేస్తున్న తప్పులను ఎవరూ కపిపుచ్చలేకపోతున్నారు. ఇటీవల వాలంటీర్ వ్యవస్థను ఆపు చేయించి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. నిన్నేమో దుకాణాల్లో మత్తు పదార్థాలు  అమ్ముతున్నారని షాకింగ్ ఆరోపణలు చేసి చాలామంది చేత చివాట్లు తిన్నారు. ఇక టీడీపీ పార్టీలో జరుగుతున్న గొడవలు తక్కువేం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: