రాయలసీమ (ప్రొద్దుటూరు): లోకేష్ మాయమాటలు.. యువ నేత బలి..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క టిడిపి పార్టీలోనే ఎన్నో రకాల విభేదాలు వినిపిస్తూ ఉన్నాయి..అందులో భాగంగానే వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్ ఆశించి టిడిపి ఇన్చార్జిగా ఉన్న జి. ప్రవీణ్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ సిఫార్సు చేసిన వ్యక్తిని కాదని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి చంద్రబాబు నాయుడు టికెట్టు ఖరారు చేశారు. దీంతో టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో ఈయన ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

బాబు గారు తనకు టికెట్ ఖరారు చేశారని.. తనకు మద్దతు చేయాలని ప్రవీణ్ ను వరదరాజులరెడ్డి కోరినప్పటికీ అతను పట్టించుకోలేదట.. దీంతో గత మూడు ఏళ్లుగా  ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పై.. పోరాటం చేసి జైలుకు వెళ్లిన ప్రవీణ్ ఇప్పుడు కీలక సమయంలో ఇలా సైలెంట్ గా ఉండడంతో అక్కడి నేతలలో చర్చనీయాంశంగా మారింది.. అయితే లోకేష్ గతంలో టిడిపిలో ఎవరిపై అయితే  ఎక్కువ కేసులు ఉంటాయో వారికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పిన మాటలను నమ్మిన ప్రవీణ్ చాలా దూకుడుగా ప్రవర్తించారు.. ఇప్పటికే ప్రవీణ్ పైన దాదాపుగా పది కేసుల వరకు నమోదయ్యాయని సమాచారం.

కొన్ని నెలలు వరకు కూడా ఆయన జైలులోనే గడిపారు..కానీ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు యాక్టివ్  అయిన వరదరాజులరెడ్డికి టికెట్ ఇవ్వడంతో ప్రవీణ్ కు దిమ్మతిరిగే షాక్ తగిలిందని తెలుస్తోంది. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ యువ నాయకుడికి ఇలాంటి పరిణామం ఎదురవడంతో అక్కడి నేతలకు మింగుడు పడడం లేదు.. యువ నాయకుడు ప్రవీణ్ కి టికెట్ అని రెండు మూడు సార్లు స్వయంగా లోకేష్ పర్యటనలో తెలియజేశారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా ప్రవీణ్ కి టికెట్ ఇవ్వకపోవడంతో అతను కన్నీటి పర్వతం అయ్యారు.. టిడిపిలో కష్టపడి పని చేస్తే టికెట్లు ఇవ్వరని.. ప్రవీణ్ కు అర్థం అయి ఉంటుందని అక్కడ నేతలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా లోకేష్ మాయమాటలు నమ్మి యువనేత ప్రవీణ్ రెడ్డి బలయ్యారని ప్రవీణ్ అనుచరులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: