పోటీపై రఘరామరాజు దిమ్మతిరిగే వ్యాఖ్యలు?

Purushottham Vinay
ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా నరసాపురం ఎంపీ స్థానం నుంచే రఘురామ పోటీ ఉంటుందని అంటున్న క్రమంలో మరో దిమ్మతిరిగే ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న రఘురామ కృష్ణంరాజు.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాననే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.అమ్మవారిని దర్శించుకోవడానికే విజయవాడ వచ్చినట్లు తెలిపిన ఆర్.ఆర్.ఆర్ నేడు నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి వెళ్లబోతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో... ఏ పార్టీయో తెలియదు.. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో తెలియదు కానీ.. పోటీ మాత్రం పక్కా! అని రఘురామ కృష్ణంరాజు దిమ్మతిరిగే విధంగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వింటున్నట్లు తెలిపిన ఆయన... ఒకటి రెండు రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని కూడా అన్నారు.ఇదే సమయలో ఫించన్ల విషయంపైనా రఘురామ స్పందించారు.


 సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో లక్షన్నర మంది సచివాలయ సిబ్బంది ఉన్నారని.. ఒక్కో వ్యక్తికీ 50 గృహాలు అప్పగిస్తే ఒక్క రోజులోనే వారంతా పింఛన్లు ఇచ్చేస్తారని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి ఎన్ని ఉత్తరాలు ఇస్తారో తెలుసుకోవాలని ఆయన సూచించారు.ఎవరు ఎన్ని కారు కూతలు కూసినా కానీ తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, తనకు అలసటనేదే లేదని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే దాకా నిద్రపోయేదీ లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రఘురామ కృష్ణంరాజు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతున్నారని.. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమయ్యారని.. ఒకటి రెండు రోజుల్లో  చంద్రబాబు సమక్షంలో టీడీపీలో అదే జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. ఇక.. ఆర్ఆర్ఆర్ రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: