ఏపీ : అన్నీ అపశకునాలే.. బాబోరికి అస్సలు కలిసిరావట్లేదా?

Reddy P Rajasekhar
ఆరు నెలల క్రితం వరకు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరిని అడిగినా టీడీపీ అని ఎక్కువమంది నుంచి సమాధానం వినిపించేది. ఏపీలో జగన్ మళ్లీ సీఎం అవుతాడని వేణుస్వామి చెప్పగా ఆయన జ్యోతిష్యం తప్పవుతుందని కొంతమంది సెలబ్రిటీలు సైతం బహిరంగంగా కామెంట్లు చేశారు. ఆరు నెలల క్రితం వైసీపీ పాలనలో అభివృద్ధి లేదని, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, రోడ్లు సరిగ్గా లేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం సగం కంటే ఎక్కువ సీట్లను వైసీపీ కైవసం చేసుకోనుందని విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో స్థానికులకు టికెట్లు ఇచ్చిన వైసీపీ అక్కడి ఓటర్ల మనస్సులను గెలుచుకోవడంలో కొంతమేర సక్సెస్ అయిందని తెలుస్తోంది. ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాలు వైసీపీకి పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయి.
 
మరోవైపు చంద్రబాబుకు మాత్రం ఏం చేసినా కలిసిరావట్లేదు. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవీరెడ్డి ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నా టీడీపీ బీజేపీ పొత్తు వల్ల ఆమె గెలుపు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు నిమ్మగడ్డ వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని చేస్తున్న పనులు టీడీపీకి తీరని నష్టం చేస్తున్నాయి. ఎంతో కీలకమైన సమయంలో పవన్ తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ప్రచారానికి దూరంగా ఉండటం కూడా టీడీపీకి పరోక్షంగా కొంతమేర నష్టం చేస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
ఈ నెల పెన్షన్లు ఆలస్యం కావడానికి, వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండటానికి చంద్రబాబే కారణమని రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు బలంగా నమ్ముతున్నారు. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ ఆపేయాలని మేమే ఈసీకి ఫిర్యాదు చేశామని కొందరు టీడీపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 
వైసీపీ కచ్చితంగా గెలుస్తుందనే నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంతృప్తిగా లేరు. సామాన్యులకు సైతం పరిచయం లేని అభ్యర్థులను ప్రకటించిన చోట్ల టీడీపీకి డిపాజిట్లు కూడా కష్టమని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయని కాలం అస్సలు కలిసిరావట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: