తిరుపతి: సొంత జిల్లాలోనే చంద్రబాబుకు ఎదురు దెబ్బ.. వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ..!!

Divya
చిత్తూరులో ఏడవ రోజు "మేమంతా సిద్ధం" అనే బస్సు యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు.. మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకు అటు కార్యకర్తలు ఇటు ప్రజలు భారీగా తరలివచ్చారు.. బస్సు యాత్రలో  భాగంగా కుప్పం నియోజకవర్గం టిడిపి నుంచి కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఇప్పుడు చంద్రబాబుకు భారీ దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.. కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్తు చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం నాయుడు ,కృష్ణమూర్తి బేతప్పలు అమ్మగారిపల్లి స్టేట్ పాయింట్ వద్ద వైసీపీలో చేరారు..
ఇక మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడే ఈ ఏ. హరికృష్ణ .. 2019లో టిడిపి తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఎన్నిక లలో ఓటమి పాలయ్యారు..ఇప్పుడు ఆయన జగన్ సమక్షంలో టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరినట్లు తెలుస్తోంది.. ఇకపోతే ఈసారి ఈ కారణం వల్లే టికెట్ దక్కలేదు.  అందుకే మనస్తాపం చెందిన ఆయన వైసీపీలోకి చేరడంతో ఆయనను  వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం  అనే బస్సు యాత్రకు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.  
నేతలు ఒకరి తర్వాత ఒకరు ఇలా టిడిపిని వదిలి వైసీపీలోకి చేరుతున్నారు దీనికి కారణం పొత్తు అని చెప్పవచ్చు. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీలు మూడో కలసి పొత్తు పెట్టుకున్నా ఈ నేపథ్యంలోనే ఆశలు పెట్టుకున్న నేతలకు టికెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే మనస్థాపం చెందిన చాలామంది సీనియర్ నేతలు ఇలా టిడిపిని వదిలి వైసిపి లోకి చేరడం హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ బదిలీలను చంద్రబాబు ఎంతవరకు ఆపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: