అంబటి.. ఆ విషయంలో పవన్ కంటే బెస్ట్ అట?

Purushottham Vinay
వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ప్రతీ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా డ్యాన్సులు చేస్తూ వైరల్ అవుతున్న తెలిసిందే. పైగా అది తనకు ఇష్టమని.. తన నియోజకవర్గ ప్రజలతోనూ, అభిమానూల్తోనూ, అనుచరులతోనూ ఇంకా గిరిజన మహిళలతోనూ డ్యాన్సులు చేయడంలో అసలు తప్పేముందని చెబుతుంటారు.ఆ మధ్య పవన్ కల్యాణ్ సినిమా "బ్రో"లో శ్యాంబాబు అని ఒక క్యారెక్టర్ సృష్టించి.. తనను ఇమిటేట్ చేశారని.. డైరెక్టుగా రాంబాబు అనే పేరు పెట్టకపోయారా అని అంబటి దానిపై రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.ఆ తర్వాత వచ్చినా 2024 సంక్రాంతి పండుగకి... "అవును అంబటీ రాంబాబూ.. సంబరాల రాంబాబు" అనే లిరిక్స్ తో మరోపాటకు డ్యాన్స్ చేస్తూ.. పవన్ పై కౌంటర్స్ వేసి మళ్ళీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. అప్పుడు మంత్రి అంబటి రాంబాబు 66 ఏళ్ల వయసులో చేసిన డ్యాన్స్ లు బాగా వైరల్ గా మారాయి.ఇలా ఏపీ రాజకీయాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా అంబటి రాంబాబు డ్యాన్స్ లు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంబటి రాంబాబు... తన డ్యాన్స్ పై సినిమా ఇండస్ట్రీకి సంబంధిన వారు ఎలా రియాక్ట్ అయ్యరనే విషయం గురించి చెప్పారు.


ఇక తాజాగా ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన అంబటి రాంబాబు... ఆయన డ్యాన్స్ లు వైరల్ అయిన తర్వాత చాలా మంది ఆయనకి ఫోన్ చేసి.. డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉందని, పవన్ కళ్యాణ్ కూడా అలా చేయలేడని, ఒక్క చిరంజీవి మాత్రమే అలా చేయగలుగుతాడని చెప్పారని అన్నారు. తనను డామినేట్ చేసేది చిరంజీవే తప్ప పవన్ కల్యాణ్ చేయలేడని చెప్పారని, 66 ఏళ్ల వయసులో పవన్ కల్యాణ్ కంటే చాలా అద్భుతంగా చేసినట్లు సినిమా ఫీల్డ్ లోనివారే చెప్పారని అంబటి రాంబాబు అన్నారు.ఇలా.. తన డ్యాన్స్.. పవన్ కల్యాణ్ డ్యాన్స్ కంటే చాలా బాగుంటుందని, మెడ పైన చెయ్యి పెట్టడం తప్ప (సంజ్ఞలతో చూపిస్తూ) పవన్ కల్యాణ్ అలా డ్యాన్స్ చేయలేడని తనకు సినిమా ఇండస్ట్రీ వాళ్లే ఫోన్ చేసి చెప్పారని అన్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: