వాళ్ళందరూ ముసలి నక్కలే.. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఇక అధికారంలో కొనసాగి తిరుగులేని పార్టీగా  పాలన సాగించిన బిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలోకి రాగానే గడ్డు పరిస్థితిలు ఏర్పడ్డాయి  ఒకప్పుడు అధికారంలో ఉండగా ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావించిన కేసీఆర్ కు ఇక ఇప్పుడు అదే పరిస్థితి వచ్చేలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

 గులాబీ దళపతి కేసీఆర్కు నమ్మిన బంటులా ఉన్న నేతలు సైతం నిర్మహమాటంగా కారు దిగి హస్తం గూటికి చేరుకుంటున్నారు. దీంతో కెసిఆర్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల కడియం శ్రీహరి, కేకే లాంటి కీలక నేతలు పార్టీని వీడడంతో మిగతా పార్టీ నేతలు అందరిలో కూడా అంతర్మదనం  మొదలైంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది పార్టీని వీడుతారో అనే విషయంపై కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. కాగా ఇలా పార్టీ మారుతున్న వారిపై అటు బిఆర్ఎస్ నేతలు విమర్శలకు గుప్పిస్తున్నారు.

 కాగా ఇలా బిఆర్ఎస్ లోని కీలక నేతలందరూ కూడా హస్తం గూటికి చేరుకుంటూ ఉండటంపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడిన కడియం శ్రీహరి కేసీఆర్ పై బురద జల్లడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు రసమయి బాలకిషన్. దళితులపై లేనిపోని కుట్రలు చేశారని.. వరంగల్లో కడియం పై చావు డప్పు కొడతాను అంటూ సంచలన విమర్శలు చేశాడు. ముసలి నక్కలన్నీ కూడా బిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్లో చేరుతున్నాయి అంటూ విమర్శించాడు. అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా వరంగల్ లో ఎంపీ గా పోటీ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రసమయి బాలకిషన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: