చంద్రబాబు: ఈ మధ్య కాలంలో చేసిన బ్లండర్‌ మిస్టేక్‌ ఇదేనా?

Chakravarthi Kalyan
ఏపీలో అత్యంత హాట్ టాపిక్ లో ప్రధానమైంది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ట్రెండింగ్ అన్నట్లు ప్రస్తుతం చర్చంతా దీని చుట్టూనే తిరుగుతూ ఉంది. పైగా ఒకటో తారీఖు రానే వచ్చేసింది కాబట్టి వాలంటీర్లకు సంబంధించిన చర్చ గ్రామాల్లో ఇంకాస్త ఎక్కువగా జరుగుతుంది. రోజూ ఈ పాటికే పింఛన్ ఇచ్చి వెళ్లేవాళ్లు. ఇంకా రాలేదేంటి  అని అవ్వాతాతలు కనిపించిన వారిని అడగడం వారేమో.. మీరే సచివాలయాలకు వెళ్లి తెచ్చుకోవాలి అని చెప్పడం జరుగుతున్నాయి.

అవును. సుమారు నాలుగన్నరేళ్లుగా అలవాటు పడిన అవ్వాతాతలు ఒక్కసారిగి సమాయానికి ఇంటికి పింఛన్ రాకపోయే సరికి ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే ఇంటికి వాలంటీర్ వచ్చి బొటన వేలు తుడుచుకుంటూ నవ్వులు చిందించే అవ్వాతాతలు ప్రస్తుతం సచివాలయాలకు బయల్దేరుతున్నారు. తాజాగా ఎన్నికల సంఘం వాలంటీర్లను సంక్షేమ పథకాలు అందించడంలో దూరం పెట్టాలని నిర్ణయిండంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అయితే మనం ఓసారి మాట్లాడిన తర్వాత దానిపై నిలబడాలి. రాజకీయాల్లో ఇలాంటివి ఉండవు అని చంద్రబాబు ని చూసి చెప్పొచ్చు. కానీ సీఎం జగన్ మాత్రం వీటికి భిన్నం. ఒక్కసారి మాట ఇచ్చారా.. దానిపై నిలబడి పోతారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. మగవారు లేని సమయంలో మన ఇంటికి వచ్చి తలుపు కొట్టడం ఏంటి తమ్ముళ్లు అంటూ వారిని అవహేళన చేస్తూ మాట్లాడారు కూడా.

మొత్తానికి వారు అనుకున్నట్లు వాలంటీర్ వ్యవస్థను ఆపేయించారు. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. దీంతో మళ్లీ మేం ఏమీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. డబ్బులు ఇళ్ల దగ్గరకు వెళ్లాల్సిందే. సచివాలయాల ద్వారా డబ్బులు పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మరొక లేఖను ఈసీకి రాసింది. మరి ఈ యూటర్న్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయం చంద్రబాబు కి అర్థం అవుతుందో లేదో ఆయనకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: