విశాఖ: టీడీపీ బ్రహ్మస్త్రం.. ప్రకంపనలు మొదలు?

Purushottham Vinay
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని సమర్ధుడని అంటారు.ఎందుకంటే ఆయనకు అసలు ఓటమనేది ఎరుగని నేత అని బలమైన పేరు ఉంది. ఆయనకి పాతికళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటి వరకు గంటా అయిదు ఎన్నికలు చూసారు. కానీ ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేని ట్రాక్ రికార్డు ఉంది. అసలు గంటా పొలిటికల్ టూర్ స్టైలే వేలే లెవెల్ లో ఉంటుంది. ఆయన విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలో కూడా గెలిచారు.అందులో పోటీ చేసిన దాంట్లో మళ్లీ పోటీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.కానీ ఆయన రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం ఆయన పోటీ చేసిన సీటులో మళ్ళీ పోటీకి దిగుతున్నారు. అదే విశాఖ భీమునిపట్నం. అయితే పది సంవత్సరాల తరువాత ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారు. 2014 వ సంవత్సరంలో భీమిలీ నుంచి పోటీ చేసి గెలిచిన గంటా 2024లో మళ్లీ ఇదే సీటు ఎంచుకోవడం వెనక ఆయనకు  సెంటిమెంట్లు ఎన్నో ఉన్నాయి. అలాగే భీమిలీ నుంచి గెలిస్తే ఏపీలో ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. అలా ఆయన మళ్ళీ మంత్రి కావాలని చూస్తున్నారు.ఇక గంటాను భీమిలీ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించి బ్రహ్మస్త్రం సంధించిన మరుక్షణం భీమిలీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే గంటా గురి పెట్టింది నేరుగా వైసీపీ మీదనే. తన శిష్యుడు అయిన అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. 


ఆయన బలాలు బలహీనతలు కూడా గంటాకు బాగా తెలుసు. దాంతో గంటా శ్రీనివాస్ రావు ఆపరేషన్ వైసీపీ అంటున్నారు. వైసీపీలో ఇప్పటిదాకా ఉన్న నాయకులను మొత్తానికి మొత్తం తన వైపునకు తిప్పుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టేశారు. అలా బలమైన నేతలుగా ఉన్న భీమిలీ జెడ్పీటీసీ గాను వెంకటప్పడుని తెలుగుదేశం వైపు లాగేశారు. ఇంకా అలాగే సింగనబంద సర్పంచు గాను వెంకట నారాయణను కూడా సైకిలెక్కించేశారు. ఇదే తీరులో భీమిలీ మండలంతో పాటు ఇతర మండలాల్లో కీలక వైసీపీ నేతలుగా ఉన్న వారి మీద ఆకర్షణ మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.వారంతా కూడా గతంలో గంటా మంత్రిగా ఉన్నపుడు భీమిలీలో ఆయనతో పనిచేసిన వారు. గంటా శ్రీనివాస్ రావు వేరే నియోజకవర్గం చూసుకోవడంతో వారు అవంతి వైపు వచ్చి 2019లో పనిచేశారు. ఇపుడు వారంతా కూడా గంటాకు జై అంటున్నారు. త్వరలో వైసీపీలో పెద్ద నాయకులు మరి కొందరు కూడా గంటా వైపు వస్తారని అంటున్నారు. ఈ పరిణామాలతో శిష్యుడు అవంతిపై టీడీపీ వేసిన గంటా బ్రహ్మస్త్రానికి విలవిలలాడుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: