ఏపి: కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి.. పెద్దిరెడ్డి ఫైర్!

Suma Kallamadi
రాయలసీమలో ఓటు అడిగే హక్కు టీడీపీ నేత చంద్రబాబు నాయుడి గారికి ఎంతమాత్రమూ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తాజాగా ఓ సమావేశంలో మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు కట్టిన దాఖలాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు అన్నిటినీ పూర్తి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... "కుప్పంలో సైతం చంద్రబాబుని ప్రజలు ఓడిస్తారు. వారికీ అన్నీ తెలుసు. ఎందుకంటే కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది జగన్‌ మాత్రమే. ఇక సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా బాగుచేస్తాడని కుప్పం ప్రజలు అనుకుంటున్నారు." అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా జనసేన అధినేత పవన్ అండతో మిత్ షా కాళ్లు పట్టుకుని మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న బాబు నేడు బీజేపీనే తమతో పొత్తు అడిగిందని అబద్దాలు చెప్పడం చాలా హాస్యపదం అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కిరణ్‌ కుమార్ రెడ్డిపై కూడా ఆయన విరుచుకు పడ్డారు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కలిగిన కిరణ్ కుమార్‌రెడ్డికి తన గురించి మాట్లాడే హక్కులేదని మండిపడ్డారు. ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్‌రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడని, సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహిగా కిరణ్ కుమార్ రెడ్డి మిగిలిపోతాడని ధ్వజమెత్తారు.
కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ... "సీఎం జగన్‌ని అణగదొక్కడానికి సోనియాగాంధీతో కిరణ్ కుమార్ కుమ్మక్కయ్యాడు. ఇప్పుడు మేము చిత్తుగా ఆయన్ని ఓడించి బుద్ధి చెప్తాము. సీఎం జగన్‌ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోంది. నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో తండోప తండాలుగా వస్తున్నారు. 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం బస్సు యాత్రతో కలిగింది!" అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: