ఏపీ: అదే జరిగితే నా శవాన్ని కళ్ళ చూస్తారు... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Suma Kallamadi
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి అనడానికి ప్రస్తుత రాజకీయాలే కారణం. అవును, నేడు ఎన్నికల్లో పాల్గొనే నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. వారి వారి స్వలాభాల కోసమే రాజకీయ బరిలోకి దిగుతున్నారు నేతలంతా. మరీ ముఖ్యంగా కొంతమంది నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల్లో తాను గెలవకుండా పొరపాటు జరిగితే మాత్రం తన శవం చూడాల్సి వస్తుందంటూ దుమారాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజాకీయల్లో ఇలా రకరకాల చిత్ర విచిత్రాలు తెరపైకి రావడం కొసమెరుపు.
దాంతో దానికి సంబందించిన వీడియోలు మీడియాలో వైరల్  గా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం బాధాకరం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు! తనకు ఓటు వేసి గెలిపించకపోతే తన శవాన్ని చూస్తారన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, పరోక్ష హెచ్చరికలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు!
అదేసమయంలో మైకందుకున్న నారాయణ రెడ్డి... "ఇవే నాకు చివరి ఎన్నికలు. తనను నమ్మి చంద్రబాబు గారు టిక్కెట్  ఇచ్చారు. గెలిచి ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఏదైనా పొరపాటు జరిగితే తన శవం చూడాల్సి వస్తుంది." అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఖంగు తిన్నారు. నారాయణ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నపుడు చేయడం గమనార్హం. దాంతో ఈ తరహా బ్లాక్  మెయిల్  పాలిటిక్స్ కి పాల్పడేవారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ వ్యాఖ్యలపై మీరేమంటారు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: