కృష్ణా: జనసేనలోకి టీడీపీ సీనియర్ నేత?

Purushottham Vinay
కూటమిలో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు దక్కడంతో జనసైనికులు, కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు వార్తలొచ్చాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.  మిగిలిన 20 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థిని ప్రకటించకుండా సందిగ్దంలో పెట్టిన నియోజకవర్గాల్లో అవనిగడ్డ మిగిలిపోయింది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని అవనిగడ్డ నుంచి పోటీ చేయమని.. మచిలీపట్నం లోక్ సభ స్థానాన్ని వంగవీటీ రాధకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారనే చర్చ  వినిపించింది. అయితే దానికి బాలశౌరి ఏమాత్రం అంగీకరించలేదని.. దీంతో అవనిగడ్డ ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలుస్తుంది.ఈ సమయంలో ఊహించని విధంగా అవనిగడ్డ టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ని అక్కడ నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే... ఆ టిక్కెట్ జనసేన పార్టీ ఖాతాలో ఉండటంతో... ఆయన ఈ రోజు జనసేనలో చేరి ఆ టిక్కెట్ దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం తెలుస్తుంది.


ఈ మేరకు పవన్ కల్యాణ్.. ఇప్పటికే బుద్దప్రసాద్ తో మాట్లాడారని.. అవనిగడ్డ టిక్కెట్ ఆఫర్ చేశారని సమాచారం తెలుస్తుంది.దీంతో... అవనిగడ్డలో జనసేన పార్టీకి ఇప్పటికీ సరైన అభ్యర్థి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి.కూటమిలో భాగంగా ఇంతకాలం పార్టీకి పనిచేసిన జనసైనికుల్లో ఒకరికి టిక్కెట్ ఇచ్చి, టీడీపీ నేతల సపోర్ట్ ఎలాగూ ఉంటుంది కాబట్టి.. మండలి వంటి సీనియర్ల సూచనల్తో ఆ టిక్కెట్ ను సెట్ చేయాల్సిందని కామెంట్స్ విపిస్తున్నాయి. ఏది ఏమైనా... జనసేనకు అవనిగడ్డ సమస్య ఈ దెబ్బతో తీరిపోయినట్లే అని తెలుస్తుంది.1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన బుద్ధప్రసాద్ కి ఈ నియోజకవర్గంలో మంచి గ్రిప్ ఉంది. ఇక్కడ జనసేనకు సరైన కేడర్, సరైన అభ్యర్థి లేకపోవడంతో  పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీచేసిన బుద్ధప్రసాద్ 5,985 ఓట్ల మెజారిటీతో గెలవగా... 2019 ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు చేతిలో 20,725 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: