జగన్‌ డ్యామేజ్‌: "వివేకం" సినిమా తెగవాడేస్తున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
ఏపీలో పొలిటికట్ సెటైరికల్ సినిమాలు కొత్త కాదు. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను, పార్టీలో లోపాలను సినిమాల ద్వారా ఎత్తి చూపేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రత్యర్థి పార్టీల్లో నేతలను లక్ష్యంగా చేసుకొని సినిమాలు తీస్తున్నారు. పోటీ పోటీగా సినిమాలు తీస్తూ ప్రజలను ఒక రకమైన గందరగోళంలోకి నెడుతున్నారు. సినిమాలతో రాజకీయాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు.

తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఇతి వృత్తంగా చేసుకొని వివేకం బయోపిక్ అనే చిత్రాన్నిరూపొందించారు. ఇందులో సీఎం దంపతులతో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అయితే రాజకీయ ప్రేపేత సినిమాలకు పత్రికలు వత్తాసు పలకడం వింతగా ఉంది.  ఈ సినిమాకు ఎల్లో మీడియా విశేషంగా ప్రచారం చేసి పెడుతోంది. వివేకం చిత్రానికి యూట్యాబ్ లో విశేష ఆదరణ లభిస్తోందని కథనం రాసుకొచ్చింది.

శుక్రవారం విడుదలైన వివేకం సినిమా ఒక్క రోజులోనే యూట్యూబ్ లో పది లక్షల వీక్షణలు లభించాయి. సీబీఐ ఛార్జిషీటులోని అంశాల ఆధారంగా టీమ్ ఎస్ క్యూబ్  ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. వివేకా హత్య అనంతరం అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విలేకరులతో మాట్లాడిన మాటలను యాథాతధంగా చూపించారు. ఒవైపు జగన్ పాత్రధారి నోట ఈ డైలాగులను పలికిస్తూ సమాంతరంగా అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యలు ఒరిజినల్ వీడియో చూపించారు.

నాటి ప్రతిపక్ష నేత జగన్ అధికార దాహం.. ఆయన బాబాయ్ వివేకా హత్యకు ఎలా దారి తీసింది. సీఎం కుర్చీమీద జగన్ పాత్రధారికి ఉన్నం మోహం రక్తసంబంధాన్ని ఎలా బలి తీసుకుంది. వివేకాపై గొడ్డలివేటు వేయడానికి కుట్ర ఎక్కడ మొదలైంది. ఎవరెవరు అమలు చేశారు. అనే అంశాలను వివేకం సినిమాలో చూపించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నతో సినిమాను మొదలుపెట్టి వివేకా హత్యకు దారితీసిన పరిణామాలను చూపించారు. అయితే రాయలసీమ ప్రాంతంలో జనం దైవ సమానంగా భావించే ఓ రాజు కడుపున రాక్షస మృగం పుట్టింది అంటూ సినిమా మొదలైంది. మొత్తం మీద జగన్ కు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమాలో దర్శకుడు, నిర్మాతల పేర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: