బీజేపీ సీట్లపై రాహుల్ సిల్లీ కామెంట్స్.. లాజిక్ లేదే?

Purushottham Vinay
దేశావ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రని చేపట్టారు. ఆ తర్వాత.. భారత్ జోడో న్యాయ యాత్ర కూడా చేపట్టారు. ఆసేతు హిమాచలం కూడా తిరిగారు.ఇంతలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా వచ్చాయి. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అధికారం దక్కించుకున్నారు. అది కూడా రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ వల్ల గెలిచింది.ఇక మిగిలిన అధికారంలో ఉన్న రాష్ట్రాలను  కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంది. ఇక, ఇప్పుడు ఆర్థికంగా ఎంతగానో ఇబ్బంది పడుతూ బాగా ఉక్కిరి బిక్కిరికి గురవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో బీజేపీపై చేస్తున్న దాడిని రాహుల్ గాంధీ కొత్త పుంతలు తొక్కించడం జరిగింది. అయితే..దీనిపై బీజేపీ ఫ్యాన్స్ నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. పార్టీలకు అతీతంగా రాహుల్‌ గాంధీని తీవ్రంగా తప్పుబడుతున్నారు.ఈవీఎమ్‌లు లేకుంటే, మ్యాచ్ ఫిక్సింగ్ జరగకపోయుంటే, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోకపోయుంటే, మీడియాపై ఒత్తిడి చేయకపోయుంటే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలుచుకోలేదు అని అన్నారు.


ఐపీఎల్ మ్యాచ్‌లలో కేప్టెన్‌లను బెదిరించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అంపైర్‌లను ఆయనే సెలెక్ట్ చేసి ప్లేయర్స్‌ని అరెస్ట్ చేయిస్తున్నారు. దేశంలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్‌లను మోడీ ఫ్రీజ్ చేయించారు. ఇప్పుడు మేం ప్రచారం చేయాలన్నా చిల్లిగవ్వ లేకుండా పోయిందఅని రాహుల్ అన్నారు.ఆర్థికంగా ఇబ్బందులు అనే మాట వ్యాలిడ్ గా ఉంటే ఈవీఎంలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా బీజేపీ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈవీఎం వ్యవస్థను తీసుకువచ్చింది.. కాంగ్రెస్ పార్టీనే కాబట్టి. ఆ తర్వాత.. దీనిపై విమర్శలు వచ్చినప్పుడు.. అంతా పర్ ఫెక్ట్ అని సర్టిపికెట్ ఇచ్చుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీనే కాబట్టి.  సుప్రీంకోర్టు,ఎన్నికల సంఘాల్లో వేసిన ఫిర్యాదుల సమయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఉపశమనం దక్కలేదు. మొత్తంగా ఈవీఎంలపై.. ఇబ్బంది లేదని కూడా సుప్రీం కోర్టు ఇంకా ఈసీ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత.. ఈవీఎంలపై పడడం సిల్లీగా ఉందని అంటున్నారు బీజేపీ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: