బీజేపీపై షర్మిళ వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్స్?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా బీజేపీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.ఆమె చేసిన కామెంట్స్ పై నెటిజన్లు కూడా అంతే స్థాయిలో మండిపడుతున్నారు.బీజేపీకి, మోడీకి ఓటమి భయం పట్టుకుందని షర్మిల చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మనదేశంలో భారత రాజ్యాంగం నడవడంలేదని, బీజేపీ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని షర్మిల కామెంట్స్ చేశారు. "కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత భయం? బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది... అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను విపక్షాలపై వదిలి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నదే బీజేపీ ప్రభుత్వం కుట్ర" అని కామెంట్స్ చేశారు. నిజానికి లెక్కలు సరిగా ఉంటే ఎవరు మాత్రం తప్పుబడతారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది బీజేపీ ఇప్పటికే 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అన్నారు. దీనికి ఓటమి భయం ఎందుకని షర్మిలని ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంపై నిరసనగా విజయవాడ ఐటీ ఆఫీసు వద్ద ధర్నా తలపెడితే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని షర్మిల ధ్వజమెత్తారు. దీనిపైన ఎక్కడో ఢిల్లీలో జరిగిన దానికి ఏపీలో ధర్నాలు ఎందుకు? అక్కడే చేయొచ్చు కదా! అని నెటిజన్స్ షర్మిలని ప్రశ్నిస్తున్నారు.


చంద్రబాబు నాయుడుతో బీజేపీ పొత్తు పెట్టుకుంది భయంతోనే అని షర్మిల కామెంట్స్ చేశారు.ఇది నిజమే అనుకుందాం.. మరి ఇండియా కూటమిగా ఏర్పడి.. కాంగ్రెస్ 13 పార్టీలతో కలిసి ఎన్నికలకు ఎలా వెళ్తోందని.. నెటిజన్లు షర్మిళని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టుల తో కలిసి మీరు కూడా పొత్తు పెట్టుకున్నారు కదా.. మరి మీరు కూడా భయపడుతున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఏపీకి ఒక్క మేలు చేయకపోయినా కానీ అదానీ, అంబానీల అనుచరులకు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారో సీఎం జగన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని షర్మిల అన్నదానికి  నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే జిందాల్ వంటి ప్రఖ్యాత సంస్థలకు ఆస్తులు కట్టబెట్టలేదా? పనులు అప్పగించలేదా? అని షర్మిళని ప్రశ్నిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: