విశాఖ: అతనికే టికెట్.. మాటనిలబెట్టుకున్న పవన్?

Purushottham Vinay
జనసేనాని పవన్ కళ్యాణ్ తన మాటని నిలబెట్టుకున్నారు. అధికారంలో ఉన్న వైసీపీని ఇంకా నాలుగేళ్ళ ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని వదులుకుని జనసేన పార్టీలో చేరినందుకు గానూ విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ని వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి కేటాయించడం జరిగింది.వాస్తవానికి ఈ టికెట్ ని వంశీకి ఇస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగింది. అనుకున్న విధంగా చూస్తే వంశీకి ప్రచారం చేసుకోమని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. వంశీ కూడా ఆఫీసుని ఓపెన్ చేసుకుని ప్రచారం మొదలు పెట్టారు. అయితే లోకల్ నేతలు మాత్రం వంశీ అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అతనికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.అలాగే వంశీని మార్చాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. దీంతో వంశీ సీటు మీద డైలమా అలా కొనసాగింది. వంశీ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంతా ఆసక్తిగా చూశారు. ఇంతలో ఆయన విశాఖలో మూడు పొత్తు టికెట్లని ప్రకటించేశారు. సౌత్ ని మాత్రం అలా పెండింగులో ఉంచేశారు.


అయితే కొత్త క్యాండిడేట్ కే టికెట్ ఇస్తారని కూడా అంతా అనుకున్నారు. కానీ ఇటీవల వంశీని పిలిపించుకుని అతనితో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆయనకే టికెట్ అని మరోసారి భరోసా ఇచ్చారు. ఆ విధంగా టికెట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక ఆదివారం వంశీకి టికెట్ ఇస్తున్నట్లుగా జనసేన పార్టీ ఆఫీసు నుంచి కీలక ప్రకటన వెలువడింది.దీంతో వంశీ వర్గం వారు ఊపిరి పీల్చుకున్నారు. తమ నాయకుడు ఇక ఎమ్మెల్యే అయినట్లే అని అంటున్నారు. విశాఖ సౌత్ లో కూటమి గెలిచేందుకు ఆస్కారం ఉంది. కానీ టీడీపీ జనసేనలలో మాత్రం అసంతృప్తి తీవ్ర స్థాయిలో  ఏర్పడింది. టీడీపీ సౌత్ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టికెట్ దక్కనందుకు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది.అయితే ఈ మధ్య కాలంలో ఆయన మళ్ళీ పార్టీలో చేరారు. ఆయనకు ఏకంగా విశాఖ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇవ్వడం జరిగింది.ఇక వంశీ రాజకీయ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాల్సిందే.2019లో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. 2021లో ఆయనను ఎమ్మెల్సీగా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: