ఉత్తరాంధ్ర: తెరపై టీడీపీ తమ్ముళ్ల కొత్త రచ్చ?

Purushottham Vinay
చంద్రబాబు మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా పెద్దగా సమస్యలు రాలేదు కానీ రెండో జాబితా, మూడో జాబితా ప్రకటించిన తర్వాత మాత్రం నియోజకవర్గాల్లో సరికొత్త చిచ్చు రేగింది.పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇంకా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తుని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ల ఫోటోలను చెప్పులతో కొడుతూ.. వాటిని కాళ్లతో తొక్కుతూ.. చింపుతూ.. పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను తగులబెట్టారు. అసలు పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.ఉత్తరాంధ్రలో టీడీపీ నేతల మధ్య సరికొత్త రచ్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పాడేరు, భీమిలి ఇంకా చీపురుపల్లి నియోజకవర్గాల్లో ప్రధానంగా సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చాయని.. పార్టీ నిలువునా చీలిందని సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలో టీడీపీ చివరి జాబితాలో భాగంగా పాడేరు టిక్కెట్ రమేష్ నాయుడికి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిప్పులు కక్కుతున్నారు. రమేష్ ని ఓడించి తీరతామని ఛాలెంజ్ చేస్తున్నారు.


తుది జాబితాలో ఊహించని విధంగా భీమిలికి గంటా శ్రీనివాసరావు పేరు ప్రకటించారు చంద్రబాబు.ముందుగా గంటాను చీపురుపల్లి పంపిస్తారని వార్తలోచ్చిన గంటా మాటే నెగ్గిందని అంటున్నారు. అయితే... 2019 వ సంవత్సరంలో గంటా భీమిలిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ నియోజకవర్గంలో ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న తనకు కాని.. గంటాకు టిక్కెట్ ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారు రాజబాబు. దీనిపై చంద్రబాబు నాయుడు తనకు సమాధానం చెప్పాలని అంటున్నారు.అలాగే చీపురుపల్లి సీటు విషయంలో కూడా రచ్చ మొదలైంది. తనకు కాకుండా.. కనీసం తనకు ఎలాంటి సమాచారం లేకుండా చీపురుపల్లి టిక్కెట్ కళావెంకట్రావుకు ఇవ్వడంపై కిమిడి నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. అందువల్ల ఈయన ప్రభావం కళావెంకట్రావుపై గట్టిగా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ సమస్యలను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: