ఉత్తరాంధ్ర: వైసీపీ 100 % ఓడిపోయే సీట్లలో తమ్మినేనిది ఫస్ట్ ప్లేసేనా...!
ఈ సారి వైసీపీ 100 % గ్యారెంటీగా ఓడిపోయే సీట్ల జాబితాలో తమ్మినేని సీతారాం కూడా కనిపిస్తున్నారు. ఈ సారి ఆయన సమీప బంధువు అయిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. రవికుమార్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తర్వాత రెండేళ్లకే నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సొంతం చేసుకున్నారు. పైగా ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇక తమ్మినేనికి సొంత పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేక గాలులు వీస్తున్నాయి.
ఈ సారి తమ్మినేనికి సీటు ఇవ్వవద్దని చాలా మంది పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అయినా కూడా తమ్మినేని సీతారాంకు వైసీపీ అధినేత జగన్ టిక్కెట్ ప్రకటించగానే.. ఆముదాల వలసలో కీలక నేతలు ఆ పార్టీ గుడ్ బై చెప్పేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవికి సువ్వారి గాంధీ కుటుంబంతో పాటు పలువరు నేతలు పార్టీకి వదిలేశారు. అముదాల వలస మండలంలో కీలకంగా ఉండే కోట గోవిందరావు బ్రదర్స్ తమ్మినేనికి సహకిరంచేది లేదని తేల్చిచెపుతున్నారు. మరి కొందరు కీలక నేతల బయట పడకపోయినా ఇంటర్నల్‌గా తమ్మినేనికి దెబ్బ వేస్తున్నారు.
ఆముదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో కూడా ద్వితీయ శ్రేణి నేతలను ఎవ్వురిని ఎదగనీయలేదు సరికదా.. కనీసం వారు ఆర్థికంగా లబ్ధిపొందేలా కూడా తమ్మినేని ఏ మాత్రం సాయం చేయలేదన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల్లోనే ఉన్నాయి. ఇటు టీడీపీ క్యాండెట్ కూన రవికుమార్ తమ్మినేనికి వరుసకు బావమరిదే అవుతారు. ఆయన మొండోడు.. తమ్మినేని గెలిచాక కూనపై ఎన్నో కేసులు పెట్టించినా రవి వెనక్కు తగ్గలేదు సరికదా.. మరింతగా రాటుదేలారు.
అటు కూన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ్మినేనిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఇదే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలను ఆలోచింపజేయడంతో పాటు కూన పట్ల చాలా సానుభూతికి కారణమవుతోంది. ఏదేమైనా ఈ సారి కూన గెలుపును ఎవ్వరూ ఆపలేరని.. వైసీపీ గ్యారెంటీగా ఓడిపోయే నియోజకవర్గాల లిస్టులో ఆముదాలవలస ఉందన్నది అందరూ చెపుతోన్న మాట.