రాయలసీమ: పెనుగొండలో వైసిపి-టిడిపి ఆసక్తికర పోరు.. గెలిచేదేవరు..?

Divya
అనంతపురం లోని పెనుకొండ రాజకీయాలు అందరిలో ఆసక్తి కల్పించేలా చేస్తున్నాయి.. ఇన్నేళ్లు పెనుగొండలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో టీడీపీ నడిచినప్పటికీ.. అనూహ్యంగా చంద్రబాబు నిర్ణయం తో కథ మొత్తంమారిపోయింది. ఇండియా హెరాల్డ్ తెలిసిన కథనం ప్రకారం.. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు సైతం ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు.. దీంతో ఇప్పుడు అందరి చూపు పెనుగొండ నియోజకవర్గం వైపుగా మళ్లీంది.. గతంలో ఉషశ్రీ కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచింది.. కానీ ఈసారి ఈమెను పెనుగొండకు మార్చారు సీఎం జగన్.

దీంతో చంద్రబాబు కూడా ఉషశ్రీ కి పోటీగా కురువ సామాజిక వర్గానికి చెందిన సవితమ్మను పోటీలో దింపారు.. అయితే ఇండియా హెరాల్డ్ కు వచ్చిన సమాచారం ప్రకారం.. సవితమ్మ స్థానికురాలు కావడం పలు రకాల సేవ కార్యక్రమాలతో బిజీగా ఉండడమే కాకుండా ప్రజల సమస్యల పైన కూడా పోరాటం చేస్తూ ఉండడం.. ఆమెకు అక్కడ బాగా కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది.. ఉషశ్రీ విషయంలో స్థానికత విషయం పైన కాస్త మైనస్ గా ఉన్నది.. అంతేకాకుండా అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు కూడా ఆమెను పెనుగొండ నుంచి పోటీ చేయవద్దంటూ చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే ఇవన్నీ కూడా టిడిపి అభ్యర్థి సవితమ్మకు బాగా కలిసి వచ్చాయి.

కానీ ఇలాంటి అంశాలను తెరపైకి తీసుకురాకుండా మంత్రి ఉషశ్రీ.. తన ఇంటి నిర్మాణాన్ని కూడా పెనుగొండలో ప్రారంభించింది. టిడిపిలో ఉండేటువంటి వర్గ విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో వ్యూహాలు రచిస్తున్నది ఉషశ్రీ. ఇలా అటు టిడిపి అభ్యర్థి సవితమ్మ.. వైసిపి మంత్రి ఉషశ్రీ ఇద్దరు కూడా మహిళలే కావడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారుతోంది.. అయితే పెనుగొండలో టిడిపి పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే గతంలో కూడా సవితమ్మ చేసినటువంటి మంచి పనులు స్థానికేతరంగా ఉండడం చేత ఆమెకు మంచి పట్టు ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: