జగన్ పాలనను సరిగ్గా విమర్శించలేని దుస్థితిలో చంద్రబాబు.. జాలేస్తోంది బాబూ..

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ఎలాగైనా గెలవాలనే తపనతో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబుకి ఏజ్ బార్ అయిపోయింది. ఈసారి గెలవకపోతే మళ్లీ వచ్చేసారి గెలిచే అవకాశాలు ఉండవు. దాంతో అతని పొలిటికల్ కెరీర్‌కి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ప్రాణం ఉన్నంతవరకు పాలిటిక్స్ లో రాణించాలని చంద్రబాబు బలంగా అనుకుంటారు. గెలవడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇక ఈసారి ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడి, వారికి పడే ఓట్లను తనకు పడేలా చేసుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నారు. అయితే ఏదైనా చెడు విషయాన్ని ఎత్తిచూపుతూ విమర్శిస్తే పర్లేదు కానీ చంద్రబాబు మంచి విషయాలను కూడా క్రిటిసైజ్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.
ఈ టీడీపీ అధినాయకుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుస్తుందా అనే సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. వైసీపీ పాలనలో బాగా చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉందా అంటే అది వాలంటీర్ వ్యవస్థే అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యవస్థను ఎవరూ కూడా విమర్శించరు. ఎందుకంటే ప్రజలకు అన్నిటినీ ఇంటి దగ్గరికే తెచ్చి ఇచ్చే గొప్ప సర్వీస్ అది. ఆ వ్యవస్థను రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పొగుడుతున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా అదే వాలంటీర్ సిస్టమ్‌ను తీసుకురావాలని చూస్తున్నాయి. ఉద్యోగులకు కూడా ఉపాధి దొరికింది. అలాంటి మంచి వ్యవస్థను ఉద్దేశించి అవి మూటలు మోసే ఉద్యోగాలు అని చంద్రబాబు నాన్సెన్స్ కూతలు కూశారు.
 ఇలా మాట్లాడుతున్న చంద్రబాబే తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలను తొలగించనని, ప్రతి ఒక్క ఉద్యోగి జీతాలను 30 వేలకు పెంచుతానని అంటున్నారు. అదే వ్యవస్థను విమర్శిస్తూ మళ్ళీ అదే వ్యవస్థను బాగు చేస్తానని ఆయన మాట్లాడటం చాలామందిని విస్తూ పోయేలా చేస్తోంది. జగన్ చాలా సదుపాయాలను, సౌకర్యాలను ప్రజలకు అందిస్తున్నారు. అవన్నీ కళ్ళముందే కనిపిస్తున్నాయి. అయినా జగన్ ఏమీ చేయలేదంటూ తాను అవన్నీ చేస్తానని చంద్రబాబుకు చెప్పడం వింటుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఇంటింటికి పెన్షన్లను తెచ్చి అందిస్తామని అంటున్నారు. జగన్ ఆల్రెడీ అదే పని చేస్తున్నారు.
 జగన్ అందిస్తున్న పథకాలు అన్నీ కూడా ప్రజలకు బాగా నచ్చేసాయి. ఆయన పదవి దిగి, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ పోతాయేమో అనే భయం ప్రజలకు పట్టుకుంది. చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ కూడా ఆయనపై ప్రజలకు ఉన్న గౌరవం, నమ్మకాన్ని పోగొట్టేలా చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని ఏ నాయకుడైనా చెబుతారు కానీ చంద్రబాబు మందు రేట్లు తగ్గిస్తామని చెబుతూ షాక్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: