తెలంగాణ: తెలంగాణ సీఎంను కలిసిన నందమూరి సుహాసిని.. కంగుతిన్న కేసీఆర్..!?

Suma Kallamadi
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు వేసుకుంటున్న సంఘటనలు అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఒకప్పుడు చాలా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాగా బలహీనంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలు గులాబీ రంగు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి జంపు చేస్తున్నారు. ఫలితంగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. 


ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ నుంచి 12 మంది, బీజేపీ నుంచి 8మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని స్వయంగా ఆ పార్టీ నేతలే కామెంట్లు చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం టీఎస్ పాలిటిక్స్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసినీ తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని మీట్ అయ్యారు.  లోక్ సభ ఎన్నికలకు ఆమె కాంగ్రెస్ పార్టీని కలవడం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీఎస్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డిని సుహాసిని కలిశారు. ఆ సందర్భంగా రేవంత్ కు ఫ్లవర్ బొకే ఇచ్చారు.


తెలంగాణ రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ పరిణామమిది అని చెప్పుకోవచ్చు.  అనూహ్యంగా బీఆర్‌ఎస్ తో అనుబంధం ఉన్న వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌తో జతకడుతున్నారు. అలానే తాజాగా టీడీపీ (తెలుగుదేశం పార్టీ) నాయకురాలు సుహాసిని కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ (గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఎన్నికల్లో ఆమెకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సుహాసిని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఆమె కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ వంటి నియోజకవర్గాల్లో ఓటర్లను తనవైపు తిప్పుకోగలదు. సుహాసిని గతంలో 2018 ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్‌పల్లి నియోజకవర్గంలో పోటీ చేసి 70 వేలకు పైగా ఓట్లు సాధించారు.
 తెలంగాణలో టీడీపీ ప్రభావం తగ్గుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ ఫిగర్ అయిన సుహాసిని తన విధేయతను కాంగ్రెస్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ చర్య వెనుక గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం మీద సుహాసిని రాజకీయ ప్రయాణం దృష్టిని ఆకర్షిస్తోంది. రాబోయే ఎన్నికలలో ఆమె వ్యూహాత్మక పాత్ర తెలంగాణలో రాజకీయ దృశ్యాన్ని రీ షేప్ చేసే అవకాశముంది. అయితే సుహాసిని అంటే అత్యంత ప్రభావశీలులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని తెలిసి కేసీఆర్ కంగు తిన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: