అమ‌రావ‌తి: కృష్ణాలో పార్టీ మారిన వైసీపీ టాప్ లీడ‌ర్ టీడీపీలో గ్యారెంటీగా గెలుస్తాడా..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఈసారి చాలామందికి కీలక నేతలు ఒక పార్టీ నుంచి మరి పార్టీలోకి జంప్ చేసి సీట్లు దక్కించుకున్నారు. మ‌రీ ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి సీట్లు దక్కని చాలామంది నేతలు తెలుగుదేశం లేదా జనసేనలోకి వెళ్లి సీట్లు సొంతం చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార వైసీపీలోకి వెళ్లి సీట్లు దక్కించుకుంటున్న వారి సంఖ్య లేకపోయినా అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లి సీట్లు దక్కించుకునే పోటీ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి కొద్ది రోజులు ముందు టిడిపి కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గత ఐదేళ్లలో పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. సీనియార్టీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వలేదు. టిడిపి కండువా కప్పుకున్న వెంటనే చంద్రబాబు పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయమని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయనకు నూజివీడు టిక్కెట్ కూడా ఖరారు చేశారు.

పార్థసారథి నూజివీడులో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక వైసిపి నుంచి ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మరోసారి పోటీ చేస్తున్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లోను నూజివీడులో ప్రతాప్ పోటీ చేస్తూ వస్తున్నారు. 2004లో గెలిచిన ప్రతాప్ 2009లో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి మారి 2014 - 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి గత రెండు ఎన్నికలలోను ఆయన మాజీ ఎమ్మెల్యే ముద్ర‌బోయిన వెంకటేశ్వరరావు పై విజయాలు సాధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా అసమతి ముద్రబోయిన పార్టీ నేతలను కలుపుకోకుండా వెళ్లడంతో ఆయన చేజేతులా ఓట‌మి పాలు కావాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పార్థసారథి నాయకత్వాన్ని టిడిపి నేతలు అందరూ అంగీకరిస్తున్నారు. ముద్రబోయిన మాత్రం తనకు అన్యాయం జరిగిందంటూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారు. అయితే ముద్రబోయినను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. పార్థసారథి తనదైన స్ట్రాట‌జీ తో నూజివీడు మున్సిపాలిటీ పై బాగా ఫోకస్ పెట్టారు. కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్ల‌ లో ఎక్కువగా ఉన్నచోట్ల బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న యాదవ సామస్కవర్గం ఓటర్లు కూడా పార్థసారథివైపు కదులుతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌తాప్‌ను వ‌రుస‌గా రెండుసార్లు నూజివీడు ప్ర‌జ‌లు గెలిపించినా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమి లేదు. నూజువీడు జ‌నాలు ఆయ‌న్ను మూడు సార్లు ఓవ‌రాల్‌గా గెలిపించినా అభివృద్ధి లేద‌ని ఈ సారి మార్పు కోరాల‌ని ఎక్కువ మంది అంటున్నారు. జ‌నసేన ఓట్లు 10 వేల వ‌ర‌కు ఉంటాయి. ఇవి కూడా టీడీపీ ప్ల‌స్ కానున్నాయి. ఏదేమైనా నూజువీడు ఈ సారి హోరాహోరీ స‌మ‌రానికి వేదిక కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: