ఆంధ్రప్రదేశ్ : బుట్టా రేణుకపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. షాకింగ్ వీడియోతో టీడీపీ కౌంటర్..?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మేమంతా సిద్ధమేనంటూ జగన్ దూకుడుగా ముందుకు సాగుతుండగా.. చంద్రబాబు మాత్రం ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా నేటి నుంచి పిఠాపురం నుంచి సమర శంఖం పూరిస్తున్నారన్నా విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు తమదైన శైలిలో ప్రసంగిస్తూనే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే టీడీపీ ని టార్గెట్ చేసి ప్రతి సభలో అదిరిపోయే సందేశం ఇస్తున్నారు.  ఆయన వ్యాఖ్యలను తీసుకుని టీడీపీ సోషల్ మీడియా కౌంటర్లు రూపంలో తిప్పికొడుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా, సోషల్ మీడియా వేదికగా వాస్తవ పరిస్థితిని, పాత వీడియోలను వెలికితీస్తూ జగన్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్నారు.
కర్నూలు మ్మిగనూరు సభలో బుట్టా రేణుకపై జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ టార్గెట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి స్పీచ్ వీడియోతో పాటు బుట్టా రేణుక ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, జగన్ బుట్టలో పడకుండా ఎంతమందికి ట్రిక్కులు చెప్పినా టీడీపీ సెటైర్లు వేసింది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. బుట్టా రేణుకకు ఓటేయండి అన్న జగన్.. పాపం బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆర్థికంగా ఎంతో దృఢంగా ఉన్న బుట్టా రేణుకపై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన టీడీపీ.. తన ఆస్తులపై బుట్టా రేణుక ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా షేర్ చేసింది.
అంతేకాదు లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, వేల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఉన్న బుట్టా రేణుక గారిని పేదరాలు,.. జగన్ ఈసారి, ఎంత బుట్టలో వేసుకున్నా జనం పడరు అంటూ సోషల్ మీడియాలో టీడీపీ పోటీ చేసింది. ఇంకా పెత్తందారులకు పేదలకు అన్న మాటలతో జగన్ జనాలను మోసం చేస్తున్నాడని టీడీపీ చేస్తున్న ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బుట్టా రేణుకకు సంబంధించిన వీడియోలో ఆమెకు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో స్పష్టంగా చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: