రాయలసీమ: సొంతింటిలోనే అలుసు.. రోజా బ్యాగు సర్దాల్సిందేనా..?

Divya
వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నగరి ఎమ్మెల్యే రోజా.. ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైనా విమర్శలు చేస్తే చాలా ఘాటుగానే కౌంటర్లు వేస్తూ ఉంటుంది రోజా.. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ ,లోకేష్ పైన ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటుంది. ఏపీ సీఎంకు సొంత చెల్లెలుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇండియన్ హెరాల్డ్ కు వచ్చిన సోర్స్ మేరకు రోజాకు నగరిలో సొంత పార్టీ నాయకులు ఆమెను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్నారని సమాచారం. వైసిపి బ్రాండ్ ని తమ వ్యక్తిగతంగా భావిస్తూ కొంతమంది శ్రమ పడుతూ ఉంటే మరి కొంతమంది రోజాకు వ్యతిరేకంగా మారుతున్నారట.

ఇండియన్ హెరాల్డ్ అందిస్తున్న పూర్తి సమాచారం మేరకు.. రోజా నియోజవర్గంలో వైసిపి పెద్దలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజాకు తెలియకుండానే నామినేట్ పదవులు కూడా ఇతరులకు కట్టబెడుతున్నారట. అలాగే రోజాకు సంబంధం లేకుండానే ఆమె వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి ఆర్థిక ప్రయోజనాలను, మైన్స్ ను కూడా ఇతరత్రా కాంట్రాక్టు పనులను కూడా కట్టబెడుతున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా ఆర్థికంగా రోజా నుంచి మెప్పు పొందిన వారు రోజానే ఈసారి ఎన్నికలలో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలుకుతున్నారు.

రోజా మాత్రం ఎంతోమంది ప్రతిపక్ష నాయకులతో కూడా ఎన్నో విమర్శలు బూతులను తిట్టించుకుని మళ్ళీ పార్టీలో కొనసాగుతున్న రోజా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది.. ఇండియన్ హెరాల్డ్ అందిస్తున్న సమాచారం ప్రకారం నగరిలో రోజా పరిస్థితి ఎలా ఉందంటే.. రోజాని పొమ్మనలేక ఉండమనలేక  అక్కడి నాయకులు రోజాకు వ్యతిరేకంగ రోజు రోజుకి రెచ్చిపోతూ ఆమె పైన విమర్శలు చేస్తున్నారట. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నగరి వైసిపి మండల నాయకుల పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్న పార్టీ పెద్దలు మాత్రం అనామకుల పైన చర్యలు తీసుకోవడంలో సిద్ధంగా ఉంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇండియన్ హెరాల్డ్ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి నగరిలో రోజా గెలవడం కాస్త కష్టమే అన్నట్టుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: