దేవినేని పేరు నిల‌బెడ‌తారా.. అవినాష్‌పైనే కొండంత ఆశ‌లు.. !

RAMAKRISHNA S.S.
బెజ‌వాడ స‌హా ఉమ్మ‌డి కృష్నాజిల్లా రాజ‌కీయ‌ల్లో దేవినేని పేరు సుప‌రిచితం. విజ‌య‌వాడ కేంద్రంగా దేవినేని నెహ్రూ (రాజ‌శేఖ‌ర్‌) పేరు మూడు ద‌శాబ్దాల‌కు పైగానే మార్మోగింది. ఇక‌, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, దేవినేని వెంక‌ట ర‌మ‌ణ‌ల పేర్లు వినిపించాయి. ఇలా.. దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు పైగానే ఈ దేవినేని పేరు టీడీపీ త‌ర‌ఫున ఎక్కువ‌గా వినిపించింది. నాయ‌కులు చాలా మంది ఉన్నా.. ఈ కుటుంబాల‌కు అటు టీడీపీలోను.. ప్ర‌జ‌ల్లోనూ కూడా ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌డింది.
అయితే.. కాల క్ర‌మేణా.. దేవినేని నెహ్రూ గ‌తించారు. దీనికి ముందే దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. అయితే.. వీరికి వార‌సులుగా.. దేవినేని ఉమామ‌హేశ్వ రరావు రాజ‌కీయాల్లోకివ‌చ్చారు. టీడీపీలో ఆయ‌న నందిగామ‌, త‌ర్వాత మైల‌వ‌రం నుంచి విజ‌యాలు అం దుకున్నారు కానీ, ఇప్పుడు ఆయ‌న టికెట్‌ను అనివార్య ప‌రిస్థితుల నేప‌థ్యంలో వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కు కేటాయించారు. దీంతో ఉమా రాజ‌కీయాలు దాదాపు ఆగిపోయిన‌ట్టే. మ‌ళ్లీ టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే త‌ప్ప‌.. ఆయ‌న‌కు రాజ‌కీయంగా దారిలేదు.
క‌ట్ చేస్తే.. దేవినేని నెహ్రూ వార‌సుడిగా వ‌చ్చిన అవినాష్ ఒక్క‌రే ఇప్పుడు ప్ర‌జాక్షేత్రంలో ఉన్నారు. అయి తే.. ఆయ‌న టీడీపీతో విబేదించి.. వైసీపీ బాట ప‌ట్టారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయన వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై దేవినేని వార‌సులు, కుటుంబాలుకూడా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాయి. ఇక‌, రాజ‌కీయంగా చూస్తే.. అవినాష్ దూకుడుగాముందుకు సాగుతున్నారు. గ‌డిచి న నాలుగేళ్లుగా కూడా.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటూ.. ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అయ్యారు.
అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ యువ నాయ‌కుడిగా స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డ‌కు వెళ్లి ప‌రిష్క‌రిం చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వైసీపీలోనూ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు రాకుండా లేకుండా కూడా చూసుకుంటున్నారు. దీంతో దేవినేని కుటుంబంలో అవినాష్ రాజ‌కీయంగా ఓ వెలుగు వెల‌గడం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. రాజ‌కీయంగా దూర‌మై పోతున్న దేవినేని కుటుంబానికి అవినాష్ తెర‌చాప‌లెత్తుతార‌ని.. పున‌ర్వైభ‌వం తీసుకువ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: