ఏంటీ.. ఒక్క విజయానికి RCBకి నెలరోజులు పట్టిందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో  మోస్ట్ అన్ లక్కీ టీం గా కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపిఎల్ సీజన్ లో కూడా ఇలాంటి చెత్త ప్రదర్శన చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే  అయితే ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళల ఆర్సిబి జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. అచ్చంగా ఇలాగే ఇక 17 ఐపీఎల్ సీజన్లో మొదటిసారి అటు పురుషుల ఆర్సిబి జట్టు కూడా టైటిల్ గెలిచి తీరుతుందని అభిమానులు బలంగా నమ్మకం పెట్టుకున్నారు.

 కానీ ఊహించిన రీతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరిని నిరాశపరిచింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు వరకు 9 మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం రెండే రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే అప్పుడెప్పుడో ఒక విజయాన్ని సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మరో విజయాన్ని అందుకుంది.

 ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఒక విజయం రావడంతో బెంగుళూరు జట్టు అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. సన్రైజర్స్ ఫై విజయంతో ఆర్సిబి వరుస ఓటములకు బ్రేక్ వేసింది. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. అయితే ఇలా రెండో విజయం సాధించడానికి ఏకంగా ఆర్సిబికి నెల రోజుల సమయం పట్టింది. మార్చి 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ పై ఓడిన ఆర్సిబి.. అదే నెల 25న పంజాబ్ కింగ్స్ పై మొదటి విజయాన్ని నమోదు చేసింది. తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడుతూ వచ్చింది. తొలి గెలుపు దక్కిన నెల రోజుల తర్వాత ఏప్రిల్ 25వ తేదీన రెండవ విజయాన్ని నమోదు చేసింది ఆర్సిబి. అయితే మిగిలిన ఐదు మ్యాచ్లలోనూ విజయం సాధించి సత్తా చాటాలని అటు అభిమానులు కోరుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: