"గేమ్ చేంజర్" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ మూవీ షూటిం కిగ్ సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ఇందులో ఈ సినిమాకు సంబంధించిన చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎల్ బీ నగర్ లో జరిగే షెడ్యూల్ తో ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు సమాచారం.

కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలల్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ పాటను విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో ఈ మూవీ యూనిట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: