రాయలసీమ: కళ్యాణ్ దుర్గం లో వైసీపీ కొత్త రాజకీయం.. ప్రయోగం ఫలించేనా..?

Divya
రాయలసీమలో ఈసారి ఎన్నికల హవా ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్ దే కనిపిస్తోంది.. ఒకప్పుడు టిడిపికి అడ్డాగా ఉన్నటువంటి అనంతపూర్ జిల్లా పరిస్థితి కూడా మారిపోయింది.. ఐదు ఆరుసార్లు టిడిపి జెండా ఎగరవేసిన కళ్యాణ్ దుర్గం లో కూడా ఇప్పుడు తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయి.. వైసీపీ సామాజిక సమీకరణాలతో చేస్తున్న ప్రయోగాలు ఏంటి వర్గపోరుతో సతమతమవుతున్న టిడిపి ఎలాంటి ఇబ్బందులను అధిగమించగలద అనే విషయం పైన ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

కర్ణాటక సరిహద్దులోని కళ్యాణదుర్గం  నియోజవర్గంలో ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది. ఎన్నికలకు ముందు వరకు రెండు పార్టీలలో గ్రూప్ వారు ఒక రేంజ్ లో సాగింది.. అయితే అధికార పార్టీ వైసీపీ మార్పులతో కొంతమేరకు పార్టీని చక్కదిద్దినట్టుగా కూడా కనిపిస్తున్నది. ఈ సమయంలోనే కొత్త నేతను టిడిపి తెరపైకి తీసుకువచ్చి ఆధిపత్యం పోరాటానికి ముగింపు పలికారు. రెండు వర్గ నేతలు కూడా ఈసారి ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

1952లో ఏర్పడిన కళ్యాణ్ దుర్గం నియోజవర్గం దాదాపుగా ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరగగా ఇందులో ఐదు సార్లు టిడిపి గెలిచింది.. మరొకసారి టిడిపి మద్దతుతో కమ్యూనిస్టు విజయం అందుకుంది. కాంగ్రెస్ రెండుసార్లు వైసీపీ ఒక్కసారి మాత్రమే కళ్యాణ్దుర్గంలో గెలుపొందుకున్నాయి. గత ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఉషాశ్రీ చరన్ దాదాపుగా 19 మెజారిటీతో గెలవడంతో ఆమెకు మంత్రి పదవిని కూడా ఇచ్చారు సీఎం జగన్. ఈసారి ఈమెను పెనుగొండ నియోజకవర్గం.

కళ్యాణ్ దుర్గం నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 27 వేల ఓట్లు ఉండగా .. అక్కడ బీసీలు ఎక్కువ ఓట్లు ఉండడంతో బోయ సామాజిక వర్గానికి 40 వేలు యాదవ కురవ సామాజిక వర్గానికి 40 వేలు ఉండగా ఎస్సీ, ఎస్టీలలో దాదాపుగా 38000 ఉన్నాయి. అందుకే బీసీలు ఎక్కువగా ఓట్లు ఉండడంతో.. అక్కడ టిడిపికి మంచి పట్టు ఉంది. కానీ గత ఎన్నికల్లో టిడిపికి చెక్ పెట్టిన వైసిపి ఈసారి సరికొత్త రాజకీయంతో ముందుకు వెళుతున్నాయి. ఈసారి సరికొత్త ప్రయోగం బీసీలలో బోయ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని బరిలోకి దింపబోతోంది వైసిపి. అందుకే తలారి రంగయ్య కు వైసిపి అభ్యర్థిగా టికెట్ ఖరారు చేశారు. ఎంపీగా పనిచేసిన ఈయన అనుభవం ఉండడంతో క్షేత్రస్థాయిలో రంగయ్యకు మంచి పట్టు ఉన్నది.. గతంలో ఓడిపోయిన టిడిపి ఈసారి ఎలాగైనా గెలవాలని లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.. అయితే ఈసారి ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకరు ఓడిపోయే పరిస్థితి ఏర్పడడంతో.. టిడిపి సురేంద్రబాబును తెరపైకి తీసుకువచ్చింది.. దీంతో కార్యకర్తలు కూడా సురేంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మొత్తానికి కళ్యాణ్ దుర్గం ఇరువురు పార్టీల మధ్య  బీసీ ఓట్లపైన గురిపెట్టిన వైసీపీ వైసిపి మరి ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: