నల్గొండ : ఆ ఎంపీ అభ్యర్థి.. మాకు వద్దే వద్దంటున్న పార్టీ శ్రేణులు?
అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా వలస వచ్చిన నేతలకు టికెట్ కేటాయించిన సమయంలో అటు కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్ నాయకుల నుంచి ఇక వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు బీజేపీ నల్గొండ ఎంపీ టికెట్ విషయంలో కూడా పార్టీలో ఇలాంటి ముసలం మొదలైంది అన్నది తెలుస్తుంది. శానంపూడి సైదిరెడ్డిని మార్చాలని ఇక పార్టీ నాయకులు అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఇలా పార్టీ నాయకులందరూ కూడా అతన్ని ఎంపీ అభ్యర్థిగా తొలగించాలి అని డిమాండ్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు ..
గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో సైదిరెడ్డి చేసిన పనులు ఇలా నాయకులందరికీ కోపం రావడానికి కారణం. గతంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో గుర్రం బోడు భూముల విషయంలో బండి సంజయ్ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు.. ఆయనను అడ్డుకోవడంతో పాటు ఆ సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలపై సైదిరెడ్డి కేసులు పెట్టించారు. ఏకంగా కార్యకర్తలపై దాడులు కూడా చేయించారు అంటూ బిజెపి నేతలు అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఎలా ఇస్తారు కనీసం క్యాడర్, జిల్లా స్థాయి నాయకులను కనుక్కోకుండా వీటిని కేటాయించడమేంటి అంటూ విమర్శలు చేస్తున్నారు సైదిరెడ్డిని అభ్యర్థిగా తొలగించి ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తీరా చిన్నపరెడ్డిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఉంది అంటూ పార్టీ నేతలు చెబుతూ ఉండడం గమనార్హం. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.