కర్నూల్ : టీడీపీలో చేరిన విజయభాస్కర్‌ రెడ్డి?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాలు స్టార్ట్ చేశాయి. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందో అని ఆసక్తి నెలకొంది.కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇంకా దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చీలిక వచ్చింది. చల్లా రామకృష్ణారెడ్డికి సొంత సోదరుడైన ఆవుకు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.చల్లా ఫ్యామిలీ మొత్తం కూడా వైసీపీలో ఉంటే.. విజయభాస్కర్‌ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో జాయిన్‌ కావడం చర్చనీయాంశం అవుతోంది.నిజానికి చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భగీరథరెడ్డి మృతి తర్వాత ఆ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. చల్లా కుటుంబం అంతా కూడా రెండు, మూడు వర్గాలుగా చీలిపోయింది. చల్లా పెద్ద కొడుకు విగ్నేష్‌రెడ్డి ఇంకా చిన్నకొడుకు భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మికి మధ్య రాజకీయ వారసత్వ పోరు తారాస్థాయికి చేరింది. వ్యవహారం కేసులు.. కోర్టుల దాకా వెళ్ళింది.


అయినా కానీ చల్లా కుటుంబమంతా వైసీపీలోనే ఉంది.కానీ.. అవుకు మండలంలో చల్లా కుటుంబానికి ఉన్న గట్టి పట్టు నేపథ్యంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే ఇంకా ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి వారి ఫ్యామిలీలో చీలిక తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చల్లా ఫ్యామిలీ లో విభేదాలను పసిగట్టిన టీడీపీ నేత బీసీ జనార్దన్‌రెడ్డి.. చల్లా విజయభాస్కర్‌ రెడ్డిపై ఫోకస్‌ పెట్టి.. టీడీపీలో చేర్పించి సక్సెస్ అయ్యారట.ఇంకా అలాగే మరోవైపు.. చల్లా కుటుంబంలో ఐక్యత కోసం బనగానపల్లె వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇంకా రామిరెడ్డి చాలా సార్లు చల్లా కుటుంబ సభ్యులను కలిసి విభేదాలు పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే.. విజయభాస్కర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో.. చల్లా కుటుంబం ప్రతిష్టపై ఎన్నో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: