టీడీపీ: కీలక నేత, నమ్మిన బంటుకి షాక్?

Purushottham Vinay
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఇంకా బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ ఇంకా 17 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తోంది.ఈ క్రమంలో మిత్ర పక్షాలు జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ సీట్లను ఇంకా 8 పార్లమెంటు సీట్లను కేటాయించింది. దీంతో తెలుగుదేశం పార్టీలో కీలక నేతలకు ఈసారి సీట్లు దక్కలేదు.ఇంకా అలాగే వైసీపీ నుంచి పార్టీలో చేరిన నేతలకు కూడా కొన్ని చోట్ల సీట్లు ఇవ్వడం వల్ల ముందు నుంచి టీడీపీలో ఉన్నవారికి సీట్లు ఇవ్వలేదు.ఈ నేపథ్యంలో టీడీపీలో సీనియర్‌ నేతగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా పేరున్న దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లభించకపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.1999, 2004ల్లో దేవినేని ఉమా కృష్ణా జిల్లా నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్‌ ను, 2004లో వసంత కృష్ణప్రసాద్‌ తండ్రి వసంత నాగేశ్వరరావును కూడా ఉమా ఓడించడం విశేషం.ఇక 2009 వ సంవత్సరంలో నందిగామ ఎస్సీ రిజర్వుడ్‌ గా మారడంతో మైలవరం నుంచి దేవినేని ఉమా పోటీ చేశారు. మరోసారి విజయం సాధించారు.ఇంకా అలాగే 2014లోనూ మైలవరం నుంచి విజయం సాధించారు.


మొత్తం ఐదుసార్లు పోటీ చేసిన దేవినేని ఉమా రెండుసార్లు నందిగామ నుంచి, రెండుసార్లు మైలవరం నుంచి గెలిచారు. తొలిసారి గత ఎన్నికల్లో మైలవరం నుంచి దేవినేని ఉమా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా మైలవరం సీటును వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ నాయుడుకు చంద్రబాబు కేటాయించారు.1999 వ సంవత్సరంలో నందిగామ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్‌ పై దేవినేని ఉమా గెలవడం విశేషం. గత ఎన్నికల్లో మాత్రం మైలవరం నుంచి వసంత చేతిలో ఉమా ఓడిపోవడం జరిగింది.ఈ క్రమంలో వచ్చే ఎన్నికలకు దేవినేని ఉమాకు సీటివ్వని చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్‌ కు సీటు కేటాయించారు. దేవినేని ఉమాను కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేయిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ మేరకు దేవినేని ఉమా పేరుతో చంద్రబాబు నాయుడు ఐవీఆర్‌ఎస్‌ సర్వే కూడా చేశారు. అయితే చివరకు పెనమలూరు సీటును తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బోడె ప్రసాద్‌ కే కేటాయించారు. అందువల్ల దేవినేని ఉమాకు సీటు లేకుండా పోయింది. తెలుగుదేశం ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం 5 చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో ఎక్కడా ఉమాకు చోటు దక్కే ఛాన్స్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: