చంద్రబాబు చేసిన తప్పు జగన్ కు ప్లస్..!!

Divya
కాపు ఉద్యమ నేత అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నాయకుడు ముద్రగడ పద్మనాభం.. వారసత్వ ఆస్తి తో పాటు ఎన్నో వందల ఎకరాల భూమిని తమ కులం కోసం ఖర్చు చేసిన వ్యక్తిగా పేరుపొందారు. ఎన్నో ఏళ్లుగా కాపు ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉన్నప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు ఇప్పటివరకు రాలేదు. కాపు ఉద్యమం కోసం పదవులను సైతం త్యాగం చేశారు.. అయితే నిన్నటి రోజున ముద్రగడ పద్మనాభం వైయస్ఆర్సీపీలో చేరడం జరిగింది.. దీంతో రాష్ట్రంలో కాపులకు ప్రయోజనాలు చేకూరుతాయని త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో కచ్చితంగా సీఎం జగన్ గెలుస్తారంటూ తెలియజేశారు.
ముద్రగడ పద్మనాభం తో పాటు ఆయన కుమారుడు గిరి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు.. విరు చేరడంతో రాజకీయ వర్గాలలో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.. తన సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి కాపు సంక్షేమం కోసం పోరాడిన ముద్రగడ గారు అనేక పదవులను త్యాగం చేశారు.. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా అప్పటి టిడిపి గవర్నమెంట్ చాలా అవమానించడం జరిగింది.

కావాలని ముద్రగడ గారిని పోలీసులు అరెస్టు చేయించారని దీంతో కాపులపై చంద్రబాబుకు తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.. గడచిన కొద్ది రోజుల క్రితం వరకు ముద్రగడ గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఈ మధ్యన జనసేన పార్టీలోకి చేరుతారని వార్తలు కూడా వినిపించాయి కానీ కుల రాజకీయ నేపథ్యంలో పొత్తుల ఉండడం వల్ల చంద్రబాబు ముద్రగడను అడ్డుకున్నారట.. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో టిడిపి జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ముద్రగడను హరి రామజోగయ్యారు పైన పరోక్షంగా సెటైర్లు వేశారు.
గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్సిపి అన్ని వర్గాల నేతలకు ప్రజలకు సైతం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 34 స్థానాలలో కాపు ప్రాబల్యం ఎక్కువగా ఉందని ముద్రగడ గారి చేరికతో వైఎస్ఆర్సిపి కి మరింత బలం చేకూరింది.. పాదయాత్రలు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినప్పటికీ కానీ కాపు నేస్తం పథకం ద్వారా చేయూత ఇస్తూ ఉండడంతో పాటు రెండు ఎంపీ స్థానాలతో పాటు 19 నియోజకవర్గాలలో కాపు అభ్యర్థులను కేటాయించారు. మహిళలకు కూడా కాపు నేస్తం ద్వారా ఆర్థిక సహాయం చేస్తూ ఉండడంతో కాపులంతా జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: